Pulse Polio | 28న పల్స్ పోలియో.. నాలుగు రోజులపాటు పోలియో చుక్కలు..
Pulse Polio | రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28 (ఆదివారం) నుంచి పల్స్ పోలియో (Pulse Polio) కార్యక్రమం నిర్వహించనున్నారు. బూత్‌లు, మొబైల్ బృందాలు, ఇంటింటి సర్వేల ద్వారా 0 నుంచి 5 ఏండ్ల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు (Polio Drops) అందించమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది.
Pulse Polio | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28 (ఆదివారం) నుంచి పల్స్ పోలియో (Pulse Polio) కార్యక్రమం నిర్వహించనున్నారు. బూత్‌లు, మొబైల్ బృందాలు, ఇంటింటి సర్వేల ద్వారా 0 నుంచి 5 ఏండ్ల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు (Polio Drops) అందించమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో భాగంగా 22,979 పోలియో బూత్‌లు, 903 మొబైల్ బృందాలు, 903 ట్రాన్సిట్ పాయింట్లను సిద్ధం చేసింది. సుమారు 40.97 లక్షల మంది ఐదేండ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు (Polio Drive) వేయాలనే లక్ష్యంతో, అందుకోసం సుమారు 52.04 లక్షల బీవోపీవీ (bOPV) టీకా డోసులను ఇప్పటికే జిల్లాలకు సరఫరా చేశారు. క్షేత్రస్థాయిలో 8,393 మంది ఏఎన్‌ఎంలు, 27,181 మంది ఆశా కార్యకర్తలు, 34,442 మంది అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు నర్సింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, , స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.
జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన పోలియో బూత్‌లలో డ్రాప్స్ వేయనున్నారు. జూన్ 29, 30 తేదీల్లో సిబ్బంది నేరుగా ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు. అయితే, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండటంతో.. అదనంగా జూలై 1న మరో రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యంగా వలస కార్మికుల పిల్లలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లోని బస్తీలు, కొత్త కాలనీలు, , గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు సూచించారు. తెలంగాణలో చివరి పోలియో కేసు 2007లో నమోదైందని, పోలియో రహిత హోదాను ఉమ్మడి రాష్ట్రంలోనే సాధించామని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
- ●Cape Verde Vs Saudi Arabia | కేప్ వెర్డే చరిత్ర..
- ●France Vs Norway | ఉస్మాన్ డెంబెలే హ్యాట్రిక్
- ●Senegal Vs Iraq | సెనెగల్ అద్భుతం
- ●Venezuela | వెనిజులాలో మరోసారి భూకంపం.. 900 దాటిన మృతులు
- ●Revanth Reddy | మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు.. భూములిచ్చేవారికి టీడీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
- ●Donald Trump | హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు.. థాంక్స్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు










