Revanth Reddy | మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు.. భూములిచ్చేవారికి టీడీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy | మూసీ రివర్‌బెడ్‌లో (Musi River) నివసిస్తున్న వారికి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు కింద డబుల్ బెడ్‌రూం ఇండ్లు (Double Bedroom Houses) కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: మూసీ రివర్‌బెడ్‌లో (Musi River) నివసిస్తున్న వారికి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు కింద డబుల్ బెడ్‌రూం ఇండ్లు (Double Bedroom Houses) కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. ప్రాజెక్టు కోసం భూములివ్వడానికి ముందుకు వచ్చే వారికి ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్(TDR) లేదా నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాలని అధికారులకు సూచించారు. మూసీ తొలి దశ అభివృద్ధిపై హైదరాబాద్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా.. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ నుంచి తీసుకుంటున్న భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు లక్ష్యాలు, చేపట్టబోయే అభివృద్ధి పనులు, భవిష్యత్‌లో రూపురేఖలను ప్రజలకు వివరించేలా నెక్లెస్‌రోడ్డులో ‘మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్’ ఏర్పాటు చేయాలన్నారు. అక్కడే మూసీ ప్రాజెక్టుపై ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించేలా ఏర్పాటు చేయాలని సూచించారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం ఓకే
రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవనంలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. బాపూఘాట్ ను గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసేందుకు రక్షణ శాఖకు చెందిన భూముల్లో నిర్మాణాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్‌లకు ఆదేశాలు జారీ చేసింది.
లంగర్ హౌజ్‌లోని బాపూఘాట్‌ను గాంధీ సరోవర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసేందుకు గోల్కొండ ఆర్టిలరీ సెంటర్‌కు చెందిన 83.814 ఎకరాల రక్షణ మంత్రిత్వ శాఖ భూమిలో ఈక్వల్ వాల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సమాన విలువ మౌలిక సదుపాయాలు) ప్రాతిపదికన నిర్మాణాలు చేసేందుకు అనుమతించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రిత్వ శాఖ, భారత ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపారు. మూసీ పునరుజ్జీవనంలో ఈ పరిణామం కీలకంగా నిలిచిపోతుందని కొనియాడారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Small Plane Crash | 109 అంతస్తుల భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో
- ●Cape Verde Vs Saudi Arabia | కేప్ వెర్డే చరిత్ర.. అరంగేట్రంలోనే రౌండ్ ఆఫ్ 32కి అర్హత
- ●France Vs Norway | ఉస్మాన్ డెంబెలే హ్యాట్రిక్
- ●Pulse Polio | 28న పల్స్ పోలియో.. నాలుగు రోజులపాటు పోలియో చుక్కలు..
- ●Senegal Vs Iraq | సెనెగల్ అద్భుతం
- ●Venezuela | వెనిజులాలో మరోసారి భూకంపం.. 900 దాటిన మృతులు

Small Plane Crash | 109 అంతస్తుల భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో

Cape Verde Vs Saudi Arabia | కేప్ వెర్డే చరిత్ర.. అరంగేట్రంలోనే రౌండ్ ఆఫ్ 32కి అర్హత

France Vs Norway | ఉస్మాన్ డెంబెలే హ్యాట్రిక్

Pulse Polio | 28న పల్స్ పోలియో.. నాలుగు రోజులపాటు పోలియో చుక్కలు..






