Cape Verde Vs Saudi Arabia | కేప్ వెర్డే చరిత్ర.. అరంగేట్రంలోనే రౌండ్ ఆఫ్ 32కి అర్హత
Cape Verde Vs Saudi Arabia | తొలిసారిగా ఫిఫా ప్రపంచకప్-2026లో అరంగేట్రం చేసిన కేప్ వెర్డే చరిత్ర సృష్టించింది. గ్రూప్-హెచ్‌లో శుక్రవారం జరిగిన కీలక మ్యాచ్‌లో సౌదీ అరేబియాతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. దాంతో తొలిసారిగా రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించింది. తొలి ప్రపంచకప్‌లోనే కేప్ వెర్డే మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకొని.. వరుసగా మూడు పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది.
- 0-0 తేడాతో మ్యాచ్ డ్రా
- ఫిఫా నాకౌట్‌కు అర్హత
- అరంగేట్రంలోనే రౌండ్ ఆఫ్ 32కి అర్హత
- ఇంటిబాట పట్టిన సౌదీ
Cape Verde Vs Saudi Arabia | తొలిసారిగా ఫిఫా ప్రపంచకప్-2026లో అరంగేట్రం చేసిన కేప్ వెర్డే చరిత్ర సృష్టించింది. గ్రూప్-హెచ్‌లో శుక్రవారం జరిగిన కీలక మ్యాచ్‌లో సౌదీ అరేబియాతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. దాంతో తొలిసారిగా రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించింది. తొలి ప్రపంచకప్‌లోనే కేప్ వెర్డే మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకొని.. వరుసగా మూడు పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. నాకౌట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో తలపడనుంది. గ్రూప్‌లో ఏడు పాయింట్లతో స్పెయిన్ గ్రూప్ టాపర్‌గా నిలువగా.. ఉరుగ్వే, సౌదీ అరేబియా రెండేసి పాయింట్లతో టోర్నీకి గుడ్‌బై చెప్పాయి.
చివరి లీగ్ మ్యాచ్‌కు ముందు ఉరుగ్వే స్పెయిన్‌పై గెలవకపోతే డ్రా కూడా తమకు సరిపోతుందని కేప్ వెర్డేకు తెలుసు. అదే వ్యూహంతో క్రమశిక్షణతో అద్భుత ప్రదర్శన చేసింది. సౌదీ అరేబియాను గోల్ చేయకుండా నిలువరించింది. మ్యాచ్‌లో పెద్దగా గోల్స్ అవకాశాలు లేకపోయినా కేప్ వెర్డేనే ఎక్కువసేపు ఆధిపత్యం చెలాయించింది. లారోస్ డువార్టేకు వచ్చిన అద్భుత అవకాశాన్ని సౌదీ గోల్‌కీపర్ మహ్మద్ అల్ ఒవైస్ అడ్డుకోగా.. విల్లీ సెమెడో కూడా ప్రత్యర్థి డిఫెండర్లను పలుసార్లు పరీక్షించాడు. తొలి అర్ధభాగం అదనపు సమయంలో మొహమ్మద్ కన్నో చేసిన హెడ్డర్‌ను కేప్ వెర్డే సీనియర్ గోల్‌కీపర్ వోజిన్హా సులభంగా అడ్డుకున్నాడు.
రెండో అర్ధభాగంలోనూ కేప్ వెర్డే దూకుడుగా ఆడుతూ మొత్తం 15 ప్రయత్నాలు చేసినప్పటికీ గోల్‌గా మలచలేకపోయింది. మరోవైపు సౌదీ అరేబియా మ్యాచ్ మొత్తం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మూడు గ్రూప్ మ్యాచ్‌ల్లో ఒక్క గోల్‌తోనే టోర్నీని నిష్క్రమించింది. మ్యాచ్ ముగిసిన వెంటనే కేప్ వెర్డే ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది మరో మ్యాచ్ ఫలితం ఏంటో తెలుసుకునేందుకు ఆరా తీశారు. తమ మొబైల్ ఫోన్లలో స్పెయిన్-ఉరుగ్వే పోరును వీక్షించారు. స్పెయిన్ విజయం దాదాపు ఖరారైన సమయంలో ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. అభిమానులు డప్పులు మోగిస్తూ సంబరాలు చేసుకోగా.. జాతీయ జెండాలు కప్పుకొని ప్లేయర్లు చాలాసేపు మైదానంలోనే ఉండి చారిత్రక విజయాన్ని ఆస్వాదించారు.
తాజావార్తలు
- ●Small Plane Crash | 109 అంతస్తుల భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో
- ●France Vs Norway | ఉస్మాన్ డెంబెలే హ్యాట్రిక్
- ●Pulse Polio | 28న పల్స్ పోలియో.. నాలుగు రోజులపాటు పోలియో చుక్కలు..
- ●Senegal Vs Iraq | సెనెగల్ అద్భుతం
- ●Venezuela | వెనిజులాలో మరోసారి భూకంపం.. 900 దాటిన మృతులు
- ●Revanth Reddy | మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు.. భూములిచ్చేవారికి టీడీఆర్: సీఎం రేవంత్ రెడ్డి








