France Vs Norway | ఉస్మాన్ డెంబెలే హ్యాట్రిక్
France Vs Norway | ఫిఫా ప్రపంచకప్-2026 గ్రూప్-ఐ చివరి మ్యాచ్‌లో నార్వేపై ఫ్రాన్స్ అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా ఉస్మాన్ డెంబేలే హ్యాట్రిక్‌తో 4-1 తేడాతో నార్వేతు చిత్తు చేసింది. ఫ్రాన్స్ ఈ విజయంతో గ్రూప్‌లో అగ్రస్థానంతో రౌండ్ ఆఫ్-32లోకి ప్రవేశించింది.
- 4-1 తేడాతో నార్వేపై ఫ్రాన్స్ ఘన విజయం
- ఈ మ్యాచ్‌లో హాలాండ్‌కు విశ్రాంతి
- వరుస మూడు విజయాలతో నాకౌట్‌లోకి
France Vs Norway | ఫిఫా ప్రపంచకప్-2026 గ్రూప్-ఐ చివరి మ్యాచ్‌లో నార్వేపై ఫ్రాన్స్ అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా ఉస్మాన్ డెంబేలే హ్యాట్రిక్‌తో 4-1 తేడాతో నార్వేతు చిత్తు చేసింది. ఫ్రాన్స్ ఈ విజయంతో గ్రూప్‌లో అగ్రస్థానంతో రౌండ్ ఆఫ్-32లోకి ప్రవేశించింది. మ్యాచ్‌కు ముందు నార్వే స్టార్ స్ట్రయికర్ ఎర్లింగ్ హాలాండ్, ఫ్రాన్స్ కెప్టెన్ కైలియన్ ఎంబాపే మధ్య పోరుగా అందరూ భావించినా.. బ్యాలన్ డి'ఓర్ విజేత ఉస్మాన్ డెంబెలే హీరోగా నిలిచాడు. తొలి అర్ధభాగంలోనే 7, 20, 32వ నిమిషాల్లో వరుసగా గోల్స్ చేసి అద్భుత హ్యాట్రిక్ నమోదు చేశాడు. దీంతో మ్యాచ్ పూర్తిగా ఫ్రాన్స్ ఆధీనంలోకి వెళ్లింది. 21వ నిమిషంలో థియో ఆస్గార్డ్ గోల్‌తో నార్వే పోరాడే ప్రయత్నం చేసినా, ఫ్రాన్స్ ఆధిపత్యాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. ఇంజ్యురీ టైమ్ (90+4వ నిమిషం)లో డిజైర్ డౌయే మరో గోల్ చేయడంతో ఫ్రాన్స్ 4-1తో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఫ్రాన్స్ గ్రూప్-ఐలో అగ్రస్థానంలో నిలిచి రౌండ్ ఆఫ్-32కు చేరుకుంది. గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన నార్వే నాకౌట్ దశలో కోట్ డి ఐవరీతో తలపడనుంది.
ఎన్నో విమర్శల మధ్య..
ఎన్నో ఏళ్లుగా ప్రతిభ ఉన్నా అంతర్జాతీయ స్థాయిలో ఆశించిన స్థాయిలో రాణించలేక విమర్శలు ఎదుర్కొన్న ఉస్మాన్ డెంబెలే.. తాజాగా ఫ్రాన్స్‌కు అసలైన మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్-ఐ చివరి మ్యాచ్‌లో నార్వేపై హ్యాట్రిక్‌తో చెలరేగి ఫ్రాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్‌లోనే అత్యుత్తమ అంతర్జాతీయ ఇన్నింగ్స్ ఆడిన డెంబెలే.. తన సత్తా ఏంటో మరోసారి చాటుకున్నాడు. ప్రపంచకప్‌కు ముందు ఈ మ్యాచ్‌ను కైలియన్ ఎంబాపే, ఎర్లింగ్ హాలాండ్‌ల మధ్య పోరుగా ప్రచారం జరిగినా.. చివరకు వార్తల్లో నిలిచింది మాత్రం బ్యాలన్ డి'ఓర్ విజేత డెంబెలేనే. ఇప్పటికే నాకౌట్‌కు అర్హత సాధించిన నార్వే హాలాండ్‌కు విశ్రాంతినివ్వగా.. ఆ అవకాశాన్ని డెంబెలే పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.
ఏడు నిమిషాల్లోనే ఖాతా తెరిచిన డెంబెలే..
మ్యాచ్ ప్రారంభమైన ఏడో నిమిషంలోనే డెంబెలే తన గోల్స్ వేట మొదలుపెట్టాడు. కుడి వైపు నుంచి బంతిని అందుకున్న అతడు ప్రత్యర్థి డిఫెండర్ ఫ్రెడ్రిక్ ఆండ్రీ బోర్కాన్‌ను చాకచక్యంగా దాటుకుని శక్తివంతమైన షాట్‌తో బంతిని గోల్‌లోకి పంపించాడు. రెండో గోల్‌లోనూ అతడి ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. వేగవంతమైన కౌంటర్ అటాక్‌లో కుడివైపు ఎంబాపే అందుబాటులో ఉన్నప్పటికీ పాస్ ఇవ్వకుండా తానే ముందుకు దూసుకెళ్లి బాక్స్ వెలుపల నుంచి అద్భుత కర్లింగ్ షాట్‌తో మరో గోల్ సాధించాడు. 32వ నిమిషంలో హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. ఆరేలియన్ చౌమెనీ అందించిన అద్భుత పాస్‌ను అందుకున్న డెంబెలే బాక్స్‌లో ప్రత్యర్థి డిఫెండర్లను ముప్పుతిప్పలు పెడుతూ గోల్‌కీపర్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బంతిని నెట్‌లోకి చేర్చాడు. ఈ హ్యాట్రిక్‌తో డెంబెలే ఫ్రాన్స్ ఫుట్‌బాల్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ నమోదు చేసిన నాలుగో ఫ్రెంచ్ ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు 1958 ప్రపంచకప్‌లో జస్ట్ ఫాంటైన్ రెండుసార్లు ఈ ఘనత సాధించగా.. 2022 ఫైనల్లో అర్జెంటీనాపై కైలియన్ ఎంబాపే హ్యాట్రిక్ నమోదు చేశాడు. అంతేకాదు ప్రపంచకప్ చరిత్రలో తొలి అర్ధభాగంలో హ్యాట్రిక్ సాధించిన ఆరో ఆటగాడిగా కూడా డెంబెలే రికార్డుల్లోకి ఎక్కాడు. 1994లో కామెరూన్‌పై రష్యా ఆటగాడు ఒలెగ్ సలెంకో తొలి అర్ధభాగంలో మూడు గోల్స్ చేసిన తర్వాత మళ్లీ ఈ ఘనత డెంబెలేకే దక్కింది. మరో విశేషం ఏమిటంటే.. డెంబెలే చేసిన మూడు గోల్స్‌కు కలిపి అంచనా గోల్స్ (ఎక్స్‌జీ) విలువ కేవలం 0.19 మాత్రమే. 1966 నుంచి ప్రపంచకప్‌ల చరిత్రలో ఇంత తక్కువ ఎక్స్‌జీతో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో ఆటగాడిగా అతడు నిలిచాడు.
ఎంబాప్పేను వెనక్కి నెట్టి..
ఎన్నో గాయాలు, విమర్శలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్న అతడు ఈ ఏడాది బ్యాలన్ డి'ఓర్ గెలుచుకోవడం ద్వారా తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు కీలక మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ ఎక్కువగా ఎంబాపేపైనే ఆధారపడేది. కానీ ఇప్పుడు డెంబెలే కూడా మ్యాచ్ ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చగల ఆటగాడిగా ఎదిగాడు. దీంతో నాకౌట్ దశలో ఫ్రాన్స్ మరింత ప్రమాదకర జట్టుగా మారింది. ఎంబాపే-హాలాండ్ పోరుగా భావించిన ఈ మ్యాచ్‌లో చివరకు అందరి దృష్టిని ఆకర్షించింది డెంబెలే ప్రదర్శనే. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, గాయాలు, విమర్శల తర్వాత ఫ్రాన్స్ ఎన్నాళ్లుగానో ఆశించిన ఆటగాడిగా అతడు ఇప్పుడు పూర్తిగా రూపాంతరం చెందాడనే విషయాన్ని మరోసారి నిరూపించాడు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Small Plane Crash | 109 అంతస్తుల భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో
- ●Cape Verde Vs Saudi Arabia | కేప్ వెర్డే చరిత్ర.. అరంగేట్రంలోనే రౌండ్ ఆఫ్ 32కి అర్హత
- ●Pulse Polio | 28న పల్స్ పోలియో.. నాలుగు రోజులపాటు పోలియో చుక్కలు..
- ●Senegal Vs Iraq | సెనెగల్ అద్భుతం
- ●Venezuela | వెనిజులాలో మరోసారి భూకంపం.. 900 దాటిన మృతులు
- ●Revanth Reddy | మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు.. భూములిచ్చేవారికి టీడీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

Small Plane Crash | 109 అంతస్తుల భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో

Cape Verde Vs Saudi Arabia | కేప్ వెర్డే చరిత్ర.. అరంగేట్రంలోనే రౌండ్ ఆఫ్ 32కి అర్హత

Pulse Polio | 28న పల్స్ పోలియో.. నాలుగు రోజులపాటు పోలియో చుక్కలు..

Senegal Vs Iraq | సెనెగల్ అద్భుతం




