త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Venezuela | వెనిజులాలో మ‌రోసారి భూకంపం.. 900 దాటిన మృతులు

Venezuela | మూడు రోజుల క్రితం వ‌చ్చిన భారీ భూకంపాల (earthquake) నుంచి తేరుకోక‌ముందే వెనిజులాలో (Venezuela) మ‌రోసారి భూమి కంపించింది. శుక్ర‌వారం (స్థానిక కాల‌మానం ప్ర‌కారం) వెనిజులా ఉత్త‌ర తీరంలోని మార‌కే (Maracay) స‌మీపంలో భూ ప్ర‌కంప‌ణ‌లు వ‌చ్చాయి.

G

International | Published On Jun 27, 2026, 7.47 am IST

Venezuela | వెనిజులాలో మ‌రోసారి భూకంపం.. 900 దాటిన మృతులు
Advertisement

Venezuela | త్రినేత్ర‌.న్యూస్‌: మూడు రోజుల క్రితం వ‌చ్చిన భారీ భూకంపాల (earthquake) నుంచి తేరుకోక‌ముందే వెనిజులాలో (Venezuela) మ‌రోసారి భూమి కంపించింది. శుక్ర‌వారం (స్థానిక కాల‌మానం ప్ర‌కారం) వెనిజులా ఉత్త‌ర తీరంలోని మార‌కే (Maracay) స‌మీపంలో భూ ప్ర‌కంప‌ణ‌లు వ‌చ్చాయి. దీని తీవ్ర‌త 4.9గా న‌మోద‌యింది. మార‌కేకు వాయవ్యంగా 61 కిలోమీట‌ర్ల దూరంలో భూకంపం వ‌చ్చింద‌ని భూకంపాల ప‌ర్య‌వేక్ష‌ణ సంస్థ ఈఎంఎస్‌సీ (⁠EMSC) తెలిపింది. దీని ప్ర‌భావంతో మార‌కే, కార‌క‌స్‌లో (Caracas) కూడా ప్ర‌కంప‌ణ‌లు వచ్చాయ‌ని అంత‌ర్జాతీయ‌ మీడియా పేర్కొంది.

కాగా, బుధ‌వారం సాయంత్రం క్ష‌ణాల వ్య‌వ‌ధిలో సంభ‌వించిన రెండు భారీ భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ప్ర‌కృతి సృష్టించిన ఈ విల‌యానికి ఇప్పటివరకు 920 మంది మృతి మృతిచెందారు. 3,360 మంది గాయ‌ప‌డ్డారు. దాదాపు మ‌రో 50 వేల మంది వ‌ర‌కు జాడ తెలియ‌రాలేదు. శిథిలాల కింది చిక్కుకున్న వేలాది మంది కోసం రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) కొన‌సాగుతున్న‌ది. జంట భూకంపాల వ‌ల్ల దేశంలో 67.6 ల‌క్ష‌ల మంది ప్ర‌భావిత‌మ‌య్యార‌ని, ఒక్క కార‌క‌స్‌లోనే 20 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు ఉంటార‌ని అంత‌ర్జాతీయ వ‌ల‌స‌ల సంస్థ తెలిపింది. శిథిలాలు తొల‌గిస్తున్నా కొద్ది మ‌ర‌ణాల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement