Bhatti Vikramarka | డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | మాదకద్రవ్యాల రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గచ్చిబౌలిలోని శిల్పకళా వేదికలో ఈగల్ (EAGLE) ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సే నో టు డ్రగ్స్’ అవగాహన కార్యక్రమంలో ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్నారు.
Bhatti Vikramarka | మాదకద్రవ్యాల రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గచ్చిబౌలిలోని శిల్పకళా వేదికలో ఈగల్ (EAGLE) ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సే నో టు డ్రగ్స్’ అవగాహన కార్యక్రమంలో ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్, తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్‌ఎన్‌ఏబీ) ద్వారా డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. మాదకద్రవ్యాల సరఫరా, విక్రయం, వినియోగం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్న ఆయన, పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
డ్రగ్స్ నిర్మూలనలో చట్టాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సామాజిక నాయకులు, సినీ ప్రముఖులు యువతను చైతన్యపరిచేందుకు ముందుకు రావాలని కోరారు. డ్రగ్స్ మాఫియాపై ఎంతటి కఠిన చర్యలైనా తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదని హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ నిర్మూలన ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు డ్రగ్స్ వ్యతిరేక వాలంటీర్‌గా మారాల్సిన అవసరం ఉందన్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, సినీ ప్రముఖులు, అధికారులు కలిసి యువతలో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సినీ నటుడు రామ్ పోతినేని, నటి మీనాక్షి చౌదరి విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ చదువు, లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమం ముగింపులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత జీవనశైలిని పాటిస్తూ, మాదకద్రవ్యాల అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణాపై సమాచారం అందిస్తామని పాల్గొన్నవారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అనితా రామచంద్రన్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Meheshwar Reddy | ఇక్కడ పాఠశాలల్లో వసతులు లేవంటే.. ఎక్కడో ఉన్న ‘ఆక్స్ఫర్డ్’ను తీసుకొస్తడట
ఆగస్టు 24, 2026

Ponnam Prabhakar | బీజేపీ దీక్షలన్నీ డ్రామాలే.. దమ్ముంటే ఢిల్లీ నుంచి ఫండ్స్ తీసుకురండి: మంత్రి పొన్నం ఫైర్
ఆగస్టు 24, 2026

Jantar Mantar Protest | మహిళా ఆందోళనకారులను వేధించారని ఆరోపణలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Sara Arjun | ప్రేమలో పడ్డ ధురంధర్ హీరోయిన్ - బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడితో సీక్రెట్ డేటింగ్?
- ●Apple | వినియోగదారులకు షాకివ్వనున్న యాపిల్.. ఐఫోన్ల ధరలు పెంపు..?
- ●Feesula Bakai - BJP Ladayi | సౌత్ ఇండియాలో చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువ నిరుద్యోగం
- ●ల్యాండ్ పూలింగ్ '60:40' ఆఫర్: భూమి ఇచ్చేముందు ప్రతి రైతు తెలుసుకోవాల్సిన 5 పక్కా నిజాలు!
- ●Heavy Rain | భారీ వర్షానికి స్తంభించిన ఢిల్లీ.. 250 విమానాలు ఆలస్యం
- ●Meheshwar Reddy | ఇక్కడ పాఠశాలల్లో వసతులు లేవంటే.. ఎక్కడో ఉన్న ‘ఆక్స్ఫర్డ్’ను తీసుకొస్తడట

Sara Arjun | ప్రేమలో పడ్డ ధురంధర్ హీరోయిన్ - బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడితో సీక్రెట్ డేటింగ్?

Apple | వినియోగదారులకు షాకివ్వనున్న యాపిల్.. ఐఫోన్ల ధరలు పెంపు..?

Feesula Bakai - BJP Ladayi | సౌత్ ఇండియాలో చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువ నిరుద్యోగం

ల్యాండ్ పూలింగ్ '60:40' ఆఫర్: భూమి ఇచ్చేముందు ప్రతి రైతు తెలుసుకోవాల్సిన 5 పక్కా నిజాలు!



