TG Weather | తెలంగాణలో భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ
TG Weather | రాష్ట్రంలో రాగల వారం రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
TG Weather | రాష్ట్రంలో రాగల వారం రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
శనివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, సోమవారం నుంచి జులై 2 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వివరించింది.
తాజావార్తలు
- ●Rashmi Gautam | యాంకర్ నుంచి జడ్జిగా ప్రమోషన్ - ఓటీటీలో రష్మి గౌతమ్ కొత్త రియాలిటీ షో - కంటెస్టెంట్స్ వీళ్లే
- ●Bhatti Vikramarka | డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Keerthy Suresh | భర్తతో కలిసి శ్రీకాళహస్తిలో కీర్తి సురేష్ ప్రత్యేక పూజలు - ఫొటోలు వైరల్
- ●ACs looting | ఎండ వేడి.. ఫ్రాన్స్‌లో ఏసీలు దోపిడీ
- ●Srinivas Goud | ఆర్ఎస్పీని చంపడానికే సెక్యూరిటీ తీసేశారు
- ●Rashmika Mandanna | కాక్టెయిల్ 2 వర్సెస్ మా ఇంటి బంగారం - సమంత సినిమాకు లాభాలు - రష్మిక సినిమాకు నష్టాలు

Rashmi Gautam | యాంకర్ నుంచి జడ్జిగా ప్రమోషన్ - ఓటీటీలో రష్మి గౌతమ్ కొత్త రియాలిటీ షో - కంటెస్టెంట్స్ వీళ్లే

Bhatti Vikramarka | డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Keerthy Suresh | భర్తతో కలిసి శ్రీకాళహస్తిలో కీర్తి సురేష్ ప్రత్యేక పూజలు - ఫొటోలు వైరల్

ACs looting | ఎండ వేడి.. ఫ్రాన్స్‌లో ఏసీలు దోపిడీ



