Senegal Vs Iraq | సెనెగల్ అద్భుతం
Senegal Vs Iraq | ఫిఫా ప్రపంచకప్‌లో వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న సెనెగల్ జట్టు కీలక మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. గ్రూప్-ఐ చివరి మ్యాచ్‌లో 10 మంది ఆటగాళ్లతో ఆడిన ఇరాక్‌ను 5-0 తేడాతో చిత్తుచేసి నాకౌట్ (రౌండ్ ఆఫ్-32) అవకాశాలను సజీవంగా ఉంచుకున్నది. టోర్నీలో అత్యుత్తమ మూడో స్థానంలో నిలిచిన జట్లలో ఒకటిగా నిలవాలంటే భారీ విజయం తప్పనిసరి.
- కీలక మ్యాచ్‌లో రాణించిన జట్టు
- ఇరాక్‌పై గోల్స్ వర్షం
- 5-0 తేడాతో ఘన విజయం
- ఫిఫా చరిత్రలో అతిపెద్ద విజయం
- నాకౌట్ ఆశలు సజీవం
Senegal Vs Iraq | ఫిఫా ప్రపంచకప్‌లో వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న సెనెగల్ జట్టు కీలక మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. గ్రూప్-ఐ చివరి మ్యాచ్‌లో 10 మంది ఆటగాళ్లతో ఆడిన ఇరాక్‌ను 5-0 తేడాతో చిత్తుచేసి నాకౌట్ (రౌండ్ ఆఫ్-32) అవకాశాలను సజీవంగా ఉంచుకున్నది. టోర్నీలో అత్యుత్తమ మూడో స్థానంలో నిలిచిన జట్లలో ఒకటిగా నిలవాలంటే భారీ విజయం తప్పనిసరి. ఈ మ్యాచ్‌లో సెనెగల్ అదే స్థాయిలో చెలరేగింది. మ్యాచ్ మొదలైన నాలుగో నిమిషంలోనే హబీబ్ డియారా తొలి గోల్‌తో సెనెగల్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇస్మాయిలా సార్, పాపే గుయే, ఇలిమాన్ ఎన్‌డియాయే గోల్స్ వేసి ఇరాన్ డిఫెన్స్‌ను ఛేదించారు. దీంతో ప్రపంచ కప్ చరిత్రలోనే సెనెగల్ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో గ్రూప్-ఐలో ఫ్రాన్స్, నార్వే తర్వాత సెనెగల్ మూడో స్థానానికి చేరుకుంది. మిగిలిన గ్రూప్ మ్యాచుల ఫలితాలపైనే నాకౌట్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. మూడోస్థానంలో నిలిచిన ఎనిమిది జట్లలో చోటు దక్కుతుందా? లేదా అన్నది శనివారం జరిగే మ్యాచుల తర్వాత తేలనుంది.
ఇరాక్‌కు రెడ్‌కార్డు షాక్
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సెనెగల్ నాలుగో నిమిషంలోనే ఖాతా తెరిచింది. లామిన్ కమారా ఇచ్చిన కార్నర్‌ను అబ్దౌలాయే సెక్ హెడ్డర్‌గా మళ్లించగా.. హబీబ్ డియారా తాకిన బంతి ఇరాక్ గోల్‌కీపర్ అహ్మద్ బాసిల్‌ను దాటి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. ఆ తర్వాత కొద్ది సేపటికే ఇరాక్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గోల్‌వైపు దూసుకెళ్తున్న సాడియో మానేను బాక్స్ అంచున రీబిన్ సులాకా అడ్డుకోవడంతో రిఫరీ ఆంథోనీ టేలర్ తొలుత ఫౌల్ ప్రకటించాడు. అనంతరం వీఏఆర్ పరిశీలన తర్వాత సులాకాకు నేరుగా రెడ్‌కార్డు చూపించాడు. దీంతో మ్యాచ్‌లో మిగిలిన 75 నిమిషాలకుపైగా ఇరాక్ 10 మందితోనే పోరాడాల్సి వచ్చింది. అయినా, తొలి అర్ధభాగంలో ఇరాక్ ఆటగాళ్లు ధైర్యంగా రక్షణాత్మక ఆట ప్రదర్శిస్తూ సెనెగల్‌ను ఎక్కువగా గోల్స్ చేయకుండా అడ్డుకున్నారు.
సెకండ్ ఆఫ్‌లో దూకుడు పెంచిన సెనెగల్
విరామం అనంతరం మాత్రం మ్యాచ్ పూర్తిగా సెనెగల్ ఆధీనంలోకి వెళ్లింది. ఎటాకింగ్‌తో ఇరాక్‌పై ఒత్తిడి పెంచిన సెనెగల్ 56వ నిమిషంలో ఇస్మాయిలా సార్ రెండో గోల్ వేశాడు. ప్రపంచకప్‌లో అతడికి ఇది నాలుగో గోల్ కాగా.. ఈ టోర్నీలో సెనెగల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అదే మ్యాచ్‌లో గోల్‌తో పాటు అసిస్ట్ నమోదు చేసిన తొలి సెనెగల్ ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత రంగంలోకి దిగిన పాపే గుయే తనదైన ముద్ర వేశాడు. దూరం నుంచి అద్భుతమైన రెండు షాట్లతో వరుసగా గోల్స్ చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. ప్రపంచకప్‌లో ప్రత్యామ్నాయ ఆటగాడిగా బరిలోకి దిగి రెండు గోల్స్ చేసిన తొలి సెనెగల్ ఫుట్‌బాలర్‌గా ఘనత సాధించాడు. చివర్లో ఇలిమాన్ ఎన్‌డియాయే కూడా దూరం నుంచి అద్భుత గోల్ నమోదు చేయడంతో సెనెగల్ 5-0తో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సార్, గుయే, ఎన్‌డియాయే ముగ్గురూ ఒక్కో గోల్‌తో పాటు ఒక్కో అసిస్ట్ నమోదు చేయడం విశేషం. ప్రపంచకప్‌లో ఒకే జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఒకే మ్యాచ్‌లో గోల్, అసిస్ట్ రెండూ నమోదు చేయడం 2014 సెమీఫైనల్లో జర్మనీ బ్రెజిల్‌పై 7-1తో గెలిచిన తర్వాత ఇదే తొలిసారి.
చరిత్ర సృష్టించిన సెనెగల్
ఈ విజయంతో పురుషుల ఫిఫా ప్రపంచకప్‌లో ఒకే మ్యాచ్‌లో ఐదు గోల్స్ చేసిన తొలి ఆఫ్రికన్ జట్టుగా సెనెగల్ చరిత్ర సృష్టించింది. భారీ గోల్ తేడాతో గెలవడం వల్ల నాకౌట్ రేసులోనూ తన అవకాశాలను మరింత పదిలం చేసుకుంది. ప్రపంచకప్‌లో ఆశలు దాదాపు ముగిసిన పరిస్థితుల్లో బరిలోకి దిగిన సెనెగల్ అద్భుత ప్రదర్శనతో రికార్డులు తిరగరాస్తూ రౌండ్ ఆఫ్ 32 ఆశలను సజీవంగా ఉంచుకున్నది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Small Plane Crash | 109 అంతస్తుల భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో
- ●Cape Verde Vs Saudi Arabia | కేప్ వెర్డే చరిత్ర.. అరంగేట్రంలోనే రౌండ్ ఆఫ్ 32కి అర్హత
- ●France Vs Norway | ఉస్మాన్ డెంబెలే హ్యాట్రిక్
- ●Pulse Polio | 28న పల్స్ పోలియో.. నాలుగు రోజులపాటు పోలియో చుక్కలు..
- ●Venezuela | వెనిజులాలో మరోసారి భూకంపం.. 900 దాటిన మృతులు
- ●Revanth Reddy | మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు.. భూములిచ్చేవారికి టీడీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

Small Plane Crash | 109 అంతస్తుల భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో

Cape Verde Vs Saudi Arabia | కేప్ వెర్డే చరిత్ర.. అరంగేట్రంలోనే రౌండ్ ఆఫ్ 32కి అర్హత

France Vs Norway | ఉస్మాన్ డెంబెలే హ్యాట్రిక్

Pulse Polio | 28న పల్స్ పోలియో.. నాలుగు రోజులపాటు పోలియో చుక్కలు..




