త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Damodar Rajanarsimha | పేదవారి ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత‌: మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌

Damodar Rajanarsimha | పేద‌వారి ఆరోగ్య భ‌ద్ర‌త ప్ర‌భుత్వ బాధ్య‌త అని రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య‌శాఖ మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ (Damodar Rajanarsimha) అన్నారు. ఆర్ఎంపీ (RMP)లు, పీఎంపీ (PMP)ల అంశం న్యాయ‌స్థానాల ప‌రిధిలో ఉంద‌ని, వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌జా ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని తెలిపారు.

A

Telangana | Published On Jan 3, 2026, 4.03 pm IST

Damodar Rajanarsimha | పేదవారి ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత‌: మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌
Advertisement

Damodar Rajanarsimha | పేద‌వారి ఆరోగ్య భ‌ద్ర‌త ప్ర‌భుత్వ బాధ్య‌త అని రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య‌శాఖ మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ (Damodar Rajanarsimha) అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలను అందించటం వరమ‌ని చెప్పారు. ఆర్ఎంపీ (RMP)లు, పీఎంపీ (PMP)ల అంశం న్యాయ‌స్థానాల ప‌రిధిలో ఉంద‌ని, వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌జా ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని తెలిపారు. శాస‌న‌మండ‌లిలో ఆర్ఎంపీలు, పీఎంపీల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి స‌మాధానం ఇస్తూ గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందిస్తున్న ఉప‌కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీ కేంద్రాలు, ఏరియా ఆసుప‌త్రులను జీజీహెచ్‌ల‌కు అనుసంధానం చేస్తున్నామ‌ని వివ‌రించారు. గ‌తంలోనే ఆర్ఎంపీ, పీఎంపీల‌కు శిక్ష‌ణ ఇచ్చామ‌ని గుర్తు చేశారు. వారికి శిక్ష‌ణ ఇవ్వ‌డంపై ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ - తెలంగాణ ప్ర‌తినిధులు, వైద్యులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ హైకోర్టును ఆశ్ర‌యించార‌ని చెప్పారు. దీంతో ఈ అంశం న్యాయ‌స్థానంలో పెండింగ్ ఉంద‌ని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు చేసిన సూచ‌న‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement