త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adilabad | రిమ్స్‌ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

Adilabad | రిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ పరిహారం అందించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు.

P

Telangana | Published On Sep 23, 2026, 7.57 pm IST

Adilabad | రిమ్స్‌ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
Advertisement

Adilabad | రిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ పరిహారం అందించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు. ఆదిలాబాద్‌లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే బాధిత చిన్నారులను హైదరాబాద్‌లోని పెద్ద ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు రిమ్స్‌లో 150 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌) నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అత్యాధునిక వసతులతో కూడిన ఎంసీహెచ్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

Advertisement
Advertisement