Gadwal Vijaya Lakshmi | వారంలోపు నియామక పత్రాలు ఇవ్వండి: గద్వాల్ విజయలక్ష్మి
Gadwal Vijaya Lakshmi | ఆర్టీసీ సూపర్‌వైజర్ పోస్టులకు ఎంపికైన 186 మందికి వారంలోపు నియామక పత్రాలు పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్‌పర్సన్, సీఎం ప్రజావాణి రాష్ట్ర స్థాయి ఇన్‌చార్జ్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు.
Gadwal Vijaya Lakshmi | త్రినేత్ర న్యూస్: ఆర్టీసీ సూపర్‌వైజర్ పోస్టులకు ఎంపికైన 186 మందికి వారంలోపు నియామక పత్రాలు పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్‌పర్సన్, సీఎం ప్రజావాణి రాష్ట్ర స్థాయి ఇన్‌చార్జ్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. అవి కేవలం ఉద్యోగ పత్రాలే కాదని.. వారి కుటుంబాలకు జీవనోపాధి, ఆర్థిక భద్రతతో ముడిపడిన అంశమన్నారు. ఈ సమస్యను మానవతా దృక్పథంతో త్వరితగతిన పరిష్కరించాలన్నారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన 257వ సీఎం ప్రజావాణిలో అభ్యర్థులు సమస్యలను ఆమె దృష్టికి తీసుకురాగా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస్ రావుతో ఫోన్‌లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు.
ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (TST), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (MST) పోస్టులకు ఎంపికైన 186 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు త్వరగా అందేలా ప్రక్రియను వేగవంతం చేయాలి. ఎంపికైన అభ్యర్థులు మరింత కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండొద్దు. మిగిలిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి వారం రోజుల్లో నియామక పత్రాలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలి. TST, MST నియామకాలకు సంబంధించి, పరిపాలనా పరంగా సాధ్యమైన మేరకు ఈ పోస్టుల నియామక ప్రక్రియను ఇతర కేడర్ల అంశాలతో ముడిపెట్టకుండా విడిగా ప్రాసెస్ చేయాలి అని ఆమె కోరారు.
తమ సమస్యను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చొరవ చూపిన గద్వాల్ విజయలక్ష్మికి ఎంపికైన అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు.
అంతకుముందు ఎంపిక ప్రక్రియ పూర్తై, ఫలితాలు మే నెలలోనే ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు నియామక ఉత్తర్వులు అందకపోవడంతో తాము తీవ్ర అనిశ్చితి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అభ్యర్థులు వివరించారు. ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో కొంతమంది ఇతర ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలను కూడా వదులుకున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నీళ్లు నిలిచినా.. వాహనాలు ఆగినా.. మీ ఉద్యోగాలుండవ్..
- ●Yadadri | యాదాద్రిలో దర్శనాలు నిలిపివేత.. ఎందుకంటే.?
- ●Stephen Raveendra | అక్టోబర్ నుంచే ధాన్యం కొనుగోళ్లు.. 65 లక్షల టన్నులు లక్ష్యం: స్టీఫెన్ రవీంద్ర
- ●Venkatesh | ఆదర్శ కుటుంబం వాయిదా - వారం వెనక్కి వెళ్లిన వెంకటేష్, త్రివిక్రమ్ మూవీ
- ●Income Tax Notice Rs 1.33 Crore Cash Deposit | రూ.1.33 కోట్లు డిపాజిట్ చేసిన రిటైర్డ్ టీచర్.. ఐటీ శాఖ నోటీసులు.. కొట్టేసిన ట్రిబ్యునల్
- ●IND Vs JPN | పోరాడి ఓడిన జపాన్.. రెండు పరుగుల తేడాతో భారత్ విన్.. వైడ్ నిర్ణయంపై హాట్ టాపిక్..!

CM Revanth Reddy | నీళ్లు నిలిచినా.. వాహనాలు ఆగినా.. మీ ఉద్యోగాలుండవ్..

Yadadri | యాదాద్రిలో దర్శనాలు నిలిపివేత.. ఎందుకంటే.?

Stephen Raveendra | అక్టోబర్ నుంచే ధాన్యం కొనుగోళ్లు.. 65 లక్షల టన్నులు లక్ష్యం: స్టీఫెన్ రవీంద్ర

Venkatesh | ఆదర్శ కుటుంబం వాయిదా - వారం వెనక్కి వెళ్లిన వెంకటేష్, త్రివిక్రమ్ మూవీ



