త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Mallu Ravi | మాక్ అసెంబ్లీ రాజ‌కీయ డ్రామా కాదా..?

MP Mallu Ravi | రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యతను విస్మరించి, తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీ పేరుతో బీఆర్ఎస్ నాయకులు కాలయాపన చేస్తున్నారని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి తీవ్రస్థాయిలో విమర్శించారు.

S

Telangana | Published On Sep 12, 2026, 4.27 pm IST

MP Mallu Ravi | మాక్ అసెంబ్లీ రాజ‌కీయ డ్రామా కాదా..?
Advertisement

అసెంబ్లీకి రావ‌డానికి బీఆర్ఎస్‌కు భ‌య‌మెందుకు..?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను నిల‌దీసిన ఎంపీ మ‌ల్లు ర‌వి

MP Mallu Ravi | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యతను విస్మరించి, తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీ పేరుతో బీఆర్ఎస్ నాయకులు కాలయాపన చేస్తున్నారని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మాక్ అసెంబ్లీ నిర్వ‌హించ‌డం రాజ‌కీయ డ్రామా కాదా..? అని నిల‌దీశారు. గాంధీ భ‌వ‌న్‌లో ఎంపీ మ‌ల్లు ర‌వి శ‌నివారం మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీకి వస్తే గత బీఆర్ఎస్ పాలనలోని అరాచకాలు, అవినీతి, అక్రమాల చిట్టా బయటపడుతుందనే భయంతోనే అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారా? ప్రజల తరఫున ప్రశ్నించాల్సిన అసెంబ్లీని వదిలేసి తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీ పెట్టుకోవడం ఎందుకు? ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ డ్రామా కాదా? గత పదేళ్ల పాలనలో చేసిన అవినీతి, అక్రమాలపై సమాధానం చెప్పాల్సిన సమయంలో తప్పించుకునేందుకు మాక్ అసెంబ్లీ పేరుతో కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో నిలదీయకుండా బయట మాక్ అసెంబ్లీలు నిర్వహించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు తమ బాధ్యత నుంచి తప్పించుకోలేరని ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు.

 

Advertisement
Advertisement