Kollapur | పీజీ విద్యార్థినిపై కాలేజీ ప్రిన్సిపాల్ లైంగిక దాడి.. ప్రైవేట్ పార్ట్ కొరకడంతో నగ్నంగానే..
Kollapur | విద్యాబుద్ధులు నేర్పి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ప్రిన్సిపాల్ (Principal) కామపిశాచిగా మారాడు. ఓ విద్యార్థిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో అతని ప్రైవేట్ పార్టును కొరికి అక్కడి నుంచి తప్పించుకుంది.
Kollapur | త్రినేత్ర.న్యూస్: విద్యాబుద్ధులు నేర్పి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ప్రిన్సిపాల్ (Principal) కామపిశాచిగా మారాడు. ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో అతని ప్రైవేట్ పార్టును కొరికి అక్కడి నుంచి తప్పించుకుంది. దీంతో ప్రిన్సిపాల్ నగ్నంగానే పారిపోయాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని (Kollapur) ప్రభుత్వ పీజీ కాలేజీలో చోటుచేసుకున్నది.
బాధితురాలు పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కొల్లాపూర్ పీజీ కాలేజీలో (Kollapur PG College) ఉన్నత విద్యను పూర్తి చేసుకుంది. టీసీ కోసం వచ్చిన ఆమెతో ప్రిన్సిపాల్ గత కొంతకాలంగా అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో కాలేజీ ప్రిన్సిపాల్ ఆ విద్యార్థినిని తన గదికి పిలిపించుకున్నాడు. ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో విద్యార్థి కోపంతో ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్ట్స్‌ను కొరికి అక్కడి నుంచి తప్పించుంది. అనంతరం ఇతర విద్యార్థులకు జరిగిన విషయం చెప్పింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రిన్సిపాల్ నివాసానికి రావడంతో భయపడి నగ్నంగానే అక్కడి నుంచి పారిపోయాడు. తనపై ప్రిన్సిపాల్ కొద్దిరోజులుగా చేస్తున్న శారీరక, మానసిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రిన్సిపాల్ తనపై అనుచితంగా ప్రవర్తించడం ఇది రెండో సారని బాధితురాలు తెలిపింది. ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలేజీలో ఉండటంతో గతంలో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ప్రిన్సిపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకొని రిమాండ్ తరలించాలని విద్యార్థుల డిమాండ్.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్
- ●HMDA | వాహనదారులకు గుడ్‌న్యూస్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?

Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం

Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్






