త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dowry Assault | థార్ కారు, బైక్ కొనివ్వ‌లేద‌ని.. భార్యను నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన భర్త

Dowry Assault | వారిది ప్రేమ వివాహం. అప్ప‌టి వ‌ర‌కు ఆమె మంచిగా చూసుకున్న అత‌డు.. పెండ్లి త‌ర్వాత అస‌లు రూపం చూపించాడు. త‌నకు థార్ కారు (Mahindra Thar) కావాల‌ని, బైక్ కొనివ్వాలంటూ వేధించ‌డం (Dowry Assault ) ప్రారంభించాడు.

G

National | Published On Oct 25, 2026, 10.58 am IST

Dowry Assault | థార్ కారు, బైక్ కొనివ్వ‌లేద‌ని.. భార్యను నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన భర్త
Advertisement

Dowry Assault | త్రినేత్ర న్యూస్‌: వారిది ప్రేమ వివాహం. అప్ప‌టి వ‌ర‌కు ఆమె మంచిగా చూసుకున్న అత‌డు.. పెండ్లి త‌ర్వాత అస‌లు రూపం చూపించాడు. త‌నకు థార్ కారు (Mahindra Thar) కావాల‌ని, బైక్ కొనివ్వాలంటూ వేధించ‌డం (Dowry Assault ) ప్రారంభించాడు. పెండ్లి కానుక‌గా థార్ కారు, బైక్ తీసుకురాలేద‌నే కోపంతో భార్య‌ను న‌డిరోడ్డుపై జ‌ట్టుప‌ట్టుకుని ఈడ్చుకెళ్లాడు (Thrash). దీంతో విసిగిపోయిన ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన ఘ‌ట‌న పంజాబ్‌లోని (Punjab) లూథియానాలో జ‌రిగింది.

లూథియానాకు (Ludhiana) చెందిన ట్వింకిల్‌, రితీశ్ శ‌ర్మ భార్యాభ‌ర్త‌లు. ట్వింకిల్ బ్యూటీషియ‌న్ కాగా, రితీశ్ హెల్త్‌కేర్ రంగంలో ప‌నిచేస్తున్నాడు. ఏడాదిపాటు ఒక‌రినొక‌రు ప్రేమించుకున్న వారు గ‌తేడాది న‌వంబ‌ర్‌లో పెండ్లి చేసుకున్నారు. రితీశ్‌కు ఇది మొద‌టి వివాహం కాగా, ట్వింకిల్‌కు రెండో పెండ్లి. రెండేండ్ల క్రితం ట్వింకిల్ విడాకుల ప్ర‌క్రియ సంద‌ర్భంగా ఇరువురికి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అదికాస్తా ప్రేమ‌గా మార‌డంతో ఇద్ద‌రు వివాహం చేసుకున్నారు. అయితే పెండ్ల‌యిన మూడు నెల‌ల త‌ర్వాత త‌న‌కు క‌ట్నంగా థార్ కారు కావాలని డిమాండ్ చేశారు. దానికోసం రోజూ ఆమెను వేధిస్తున్నాడు. దీంతో ఓ మ‌ధ్య‌వ‌ర్తులు పంచాయితీ చేసి స‌ర్దిచెప్పారు. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు మ‌ళ్లీ బైక్ (Bike) కావాలంటూ గొడ‌వ ప్రారంభించాడు. ఇదే విష‌యమై ట్వింకిల్‌ను రోజూ కొడుతున్నాడు.

ఈ క్ర‌మంలో ఈ నెల 21న రాత్రి ఇరువురి మ‌ధ్య గొడ‌వ ముద‌ర‌డంతో ఆమె ఇంటి నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీసింది. పొరుగువారి ఇంటికి పారిపోయింది. అయితే అక్క‌డికి వెళ్లి ఆమెను కొట్టాడు. అనంత‌రం జుట్టుప‌ట్టుకుని ఈడ్చుకొచ్చి రోడ్డుపై దాడిచేశాడు. అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు బ‌య‌ట‌కు వ‌చ్చి ట్వింకిల్‌ను కాపాడారు. దీంతో ఓపిక న‌శించిన ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అందించింది. దీంతో రితీశ్‌పై కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement