త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allam Narayana | జ‌ర్న‌లిస్టుల‌కూ క్యాష్‌లెస్ హెల్త్ స్కీం అమ‌లు చేయాలి.. అల్లం నారాయ‌ణ డిమాండ్

Allam Narayana | ప్ర‌భుత్వ ఉద్యోగుల మాదిరే జ‌ర్న‌లిస్టుల‌కు కూడా క్యాష్‌లెస్ హెల్త్ స్కీంను అమ‌లు చేయాల‌ని ప్రెస్ అకాడ‌మీ మాజీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Feb 24, 2026, 5.45 pm IST

Allam Narayana | జ‌ర్న‌లిస్టుల‌కూ క్యాష్‌లెస్ హెల్త్ స్కీం అమ‌లు చేయాలి.. అల్లం నారాయ‌ణ డిమాండ్
Advertisement

Allam Narayana | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌భుత్వ ఉద్యోగుల మాదిరే జ‌ర్న‌లిస్టుల‌కు కూడా క్యాష్‌లెస్ హెల్త్ స్కీంను అమ‌లు చేయాల‌ని ప్రెస్ అకాడ‌మీ మాజీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో జ‌ర్న‌లిస్టుల ప్ర‌తినిధుల‌తో క‌లిసి అల్లం నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు.

ఉద్యోగులకు నిన్న ప్రకటించిన ఈహెచ్ఎస్‌ లాగానే జర్నలిస్టులకు జేహెచ్ఎస్‌ను అమలు చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టులకు ఇప్పటి వరకు ఒక్క విషయంలో కూడా సానుకూలంగా లేదు. మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయ‌లేదు. అక్రిడిటేషన్ల విషయంలో నిత్యం ఆందోళనలను చూస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవో ఆధారంగా జర్నలిస్టుల‌కు హెల్త్ కార్డు ఇచ్చి చాలా మంది జర్నలిస్టుల‌కు లబ్ది చేకూరేలా చూశాం. తక్షణమే జర్నలిస్ట్ హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం ప్ర‌క‌ట‌న చేయాల‌ని అల్లం నారాయ‌ణ డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు ఆస్కాని మారుతీ సాగ‌ర్, బాపురావు, న‌వీన్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

Advertisement
Advertisement