త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Warangal | వరంగల్‌లో రోడ్డు ప్రమాదం.. నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలి మృతి

Warangal | రంగల్‌లో (Warangal) విషాదం చోటుచేసుకుంది. సోమ‌వారం రాత్రి హంట‌ర్ రోడ్డులో జ‌రిగిన ప్రమాదంలో (Road Accident) వైద్యురాలు మృతిచెందారు. ఆమె నిండు గర్భిణిగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

G

Telangana | Published On Jan 27, 2026, 12.45 pm IST

Warangal | వరంగల్‌లో రోడ్డు ప్రమాదం.. నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలి మృతి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: వరంగల్‌లో (Warangal) విషాదం చోటుచేసుకుంది. సోమ‌వారం రాత్రి హంట‌ర్ రోడ్డులో జ‌రిగిన ప్రమాదంలో (Road Accident) వైద్యురాలు మృతిచెందారు. ఆమె నిండు గర్భిణిగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన ఎస్‌.మమతారాణి (Doctor Mamatha Rani) డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. వ‌రంగ‌ల్‌లోని హంటర్‌రోడ్డులో (Hunter Road) ఉన్న‌ ఫాదర్‌ కొలంబో హాస్పిట‌ల్‌లో జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో గ‌త కాలంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్ర‌మంలో గతేడాది నారాయణపేట జిల్లాకు చెందిన డాక్టర్‌ రాఘవేంద్రతో ఆమెకు పెండ్లి అయింది. ప్ర‌స్తుతం ఆమె నిండు గ‌ర్భిణి. అయిన‌ప్ప‌టికీ విధుల‌కు హాజ‌ర‌వుతున్న‌ది.

ఇందులో భాగంగా సోమవారం రాత్రి డ్యూటీ ముగిసిన త‌ర్వాత భర్తతో కలిసి బైక్‌పై ఇంటికి బ‌య‌ల్దేరారు. మార్గమధ్యలో ఏడు మోరీల కూడలి వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్‌ వారి బైక్‌ను వెనుక‌నుంచి ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు కింద పడిపోయారు. 9 నెలల గర్భిణిగా ఉన్న మమతా రాణి తీవ్రంగా గాయపడింది.

స్థానికుల సహాయంతో రాఘ‌వేంద్ర‌ ఆమెను నగరంలోని ఓ ప్రైవేటు ద‌వాఖాన‌కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతురాలి భ‌ర్త ఫిర్యాదుతో ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. టిప్ప‌ర్ డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఝార్ఖండ్‌కు చెందిన అన్సారీగా గుర్తించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement