త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Polytechnic Students Protest | కంటోన్మెంట్‌లో పాలిటెక్నిక్ విద్యార్థినుల ధ‌ర్నా.. ఫోన్‌లో మ‌ద్ద‌తు తెలిపిన కేటీఆర్‌

Polytechnic Students Protest | సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప‌రిధిలోని సంగీత్ జంక్షన్ వద్ద శ‌నివారం పాలిటెక్నిక్ విద్యార్థినులు భారీ నిర‌స‌న‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థినులు నేల‌పై బైఠాయించి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పెద్ద‌పెట్టున నినాదాలు చేశారు. ఈ ధ‌ర్నా విష‌యాన్ని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత మ‌న్నే క్రిశాంక్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ల‌డంతో ఆయ‌న ఫోన్‌లో విద్యార్థినుల‌తో మాట్లాడారు.

S

Telangana | Published On Sep 5, 2026, 1.20 pm IST

Polytechnic Students Protest | కంటోన్మెంట్‌లో పాలిటెక్నిక్ విద్యార్థినుల ధ‌ర్నా.. ఫోన్‌లో మ‌ద్ద‌తు తెలిపిన కేటీఆర్‌
Advertisement

Polytechnic Students Protest | త్రినేత్ర‌.న్యూస్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప‌రిధిలోని సంగీత్ జంక్షన్ వద్ద శ‌నివారం పాలిటెక్నిక్ విద్యార్థినులు భారీ నిర‌స‌న‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థినులు నేల‌పై బైఠాయించి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పెద్ద‌పెట్టున నినాదాలు చేశారు. ఈ ధ‌ర్నా విష‌యాన్ని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత మ‌న్నే క్రిశాంక్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ల‌డంతో ఆయ‌న ఫోన్‌లో విద్యార్థినుల‌తో మాట్లాడారు. ఎళ్ల‌వేళ‌లా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 97 రద్దు చేసేవరకు పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు.

రేవంత్ రెడ్డి పాల‌న అంతా భూముల చుట్టే తిరుగుతుంది. రేవంత్ ప్ర‌భుత్వం ఉద్దేశం ఒక‌టే.. పాలిటెక్నిక్ లేకుండా చేయ‌డం. హైద‌రాబాద్‌లోని భూముల‌న్నీ అమ్ముకొని రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల‌నేదే ఆయ‌న ఉద్దేశం. స్కిల్ యూనివ‌ర్సిటీ పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు టాక్స్ ద్వారా ల‌క్ష‌ల మంది పిల్ల‌ల‌కు నైపుణ్య శిక్ష‌ణ ఇచ్చాం. అదే ప‌రిస్థితిలో ఇప్పుడు కూడా కంటిన్యూ చేయొచ్చు. కానీ రేవంత్‌కు ఇష్టం లేదు. అందుకే మీ పొట్ట కొడుతున్న‌డు. మీ త‌ర‌ఫున శాస‌న స‌భ‌లో ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తాం అని కేటీఆర్ విద్యార్థినుల‌కు భ‌రోసా ఇచ్చారు. కాగా అంత‌కుముందు నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థినులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement