V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్
V Prakash | రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలంగాణ అస్తిత్వ వేదిక తరపున రాజకీయ విశ్లేషకులు వీ ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
V Prakash | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలంగాణ అస్తిత్వ వేదిక తరపున రాజకీయ విశ్లేషకులు వీ ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్‌లో నిర్వహించిన సమావేశంలో వీ ప్రకాశ్ ప్రసంగించారు. గతంలో తెలంగాణ ప్రత్యేక దేశంగా ఉంది.. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు కొనసాగితే.. ఇప్పుడు అదే డిమాండ్ చేయాల్సి వస్తుందన్నారు. ప్యారడైజ్ సినిమాలో చేసినట్లుగా చేయాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు ఆంధ్రాతో పాటు తెలంగాణకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నట్లు వ్యవహరిస్తున్నాడు. ఇక్కడి నిర్ణయాలన్నీ బాబు అభీష్టం మేరకు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు ఇక ఆగాలి. పాలకులు గత చరిత్రను గుర్తుంచుకోవాలని ప్రకాశ్ సూచించారు.

వరంగల్ ఎయిర్‌పోర్టుకు జయశంకర్ పేరు పెట్టాలి..
వరంగల్ ఎయిర్‌పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని కోరుతున్నా. తెలంగాణ రాణి రుద్రమ పట్ల వ్యతిరేకత లేదు. రాజుల పేరు ఎయిర్‌పోర్ట్‌కు పెట్టొద్దు. కాకతీయ రాజులైన రాణి రుద్రమదేవి, గణపతిదేవుల పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా వాటికి వాళ్ల పేర్లు ఉన్నాయి. కొత్తగా వాళ్లకు గుర్తింపు అవసరం లేదు. ఆదివాసీలైన సమ్మక్క, సారక్కలను హతమార్చింది కాకతీయ రాజులే, అందుకే ఆ పేర్లు పెట్టొద్దు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి. ఆయన వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరికీ ఆయన గురువు. జయశంకర్ పేరు పెడితే ఎలాంటి వివాదం ఉండదు. జయశంకర్ సార్ పేరు కాకపోతే పీవీ నరసింహారావు పేరు పెట్టండి అని ప్రకాశ్ సూచించారు.
ఈ కార్యక్రమంలో శ్రీధర్ దేశ్ పాండే, కారం రవీందర్ రెడ్డి, పిట్టల రవీందర్, సీనియర్ జర్నలిస్టు బుచ్చన్న, ఆయాచితం శ్రీధర్, వేణుగోపాల్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్
- ●Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్
- ●Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ
- ●AISF | ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష, కార్యదర్శిగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్
- ●Kakatiya Kala Thoranam | రూ.10 లక్షల బిడ్‌తో టాప్-3లో కాకతీయ కళాతోరణం
- ●MLA Naveen Yadav | బీసీల లెక్కలు తేలాల్సిందే : ఎమ్మెల్యే నవీన్ యాదవ్

ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్

Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్

Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ

AISF | ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష, కార్యదర్శిగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్




