త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Protest in Nalgonda | మాజీ ఎమ్మెల్యే దుస్తులు చింపేసిన పోలీసులు.. న‌ల్ల‌గొండ‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌

BRS Protest in Nalgonda | న‌ల్ల‌గొండ జిల్లా పెద్ద‌వూర మండ‌లంలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ వ‌ద్ద సోమ‌వారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌పై పోలీసుల దాడిని నిర‌సిస్తూ గులాబీ ద‌ళం భ‌గ్గుమంది.

S

Telangana | Published On Sep 7, 2026, 6.07 pm IST

BRS Protest in Nalgonda | మాజీ ఎమ్మెల్యే దుస్తులు చింపేసిన పోలీసులు.. న‌ల్ల‌గొండ‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌
Advertisement

BRS Protest in Nalgonda | త్రినేత్ర‌.న్యూస్‌: న‌ల్ల‌గొండ జిల్లా పెద్ద‌వూర మండ‌లంలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ వ‌ద్ద సోమ‌వారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌పై పోలీసుల దాడిని నిర‌సిస్తూ గులాబీ ద‌ళం భ‌గ్గుమంది. దీన్ని నిర‌సిస్తూ జాతీయ ర‌హ‌దారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ క్ర‌మంలో రేవంత్ దిష్టిబొమ్మ ద‌హ‌నం చేసేందుకు ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్క‌డి ప‌రిస్థితులు ఒకానొక స‌మ‌యంలో తారాస్థాయికి చేరాయి. నాయ‌కుల‌ను అడ్డుకునే క్ర‌మంలో నాగార్జున‌సాగ‌ర్ మాజీ ఎమ్మెల్యే భ‌గ‌త్ కుమార్‌ దుస్తులు చినిగిపోయాయి.

రాస్తారోకో వద్దకు వచ్చిన పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పట్ల అనుచితంగా వ్యవహరించార‌ని నేత‌లు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో సీఎం డౌన్ డౌన్‌.. పోలీస్ జులూం న‌శించాలి, వద్దురా నాయ‌నా.. ఈ కాంగ్రెస్ పాల‌న అంటూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు.

Advertisement
Advertisement