త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balka Suman | క్యాత‌న‌పల్లిలో ఉద్రిక్త‌త‌.. బాల్క సుమ‌న్ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

Balka Suman | మంచిర్యాల జిల్లా క్యాత‌నప‌ల్లిలో (Kyathanpalli) తీవ్ర ఉద్రిక్త‌త కొన‌సాగుతున్న‌ది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ (Balka Suman) ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఆయ‌న‌ను ఏ క్ష‌మైన అదుపులోకి తీసుకునే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు రావ‌డంతో బీఆర్ఎస్ నాయ‌కులు కూడా పెద్ద సంఖ్య‌లో సుమ‌న్ నివాసానికి త‌ర‌లివ‌స్తున్నారు.

G

Telangana | Published On Feb 18, 2026, 10.17 am IST

Balka Suman | క్యాత‌న‌పల్లిలో ఉద్రిక్త‌త‌.. బాల్క సుమ‌న్ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
Advertisement

Balka Suman | త్రినేత్ర‌.న్యూస్‌: మంచిర్యాల జిల్లా క్యాత‌నప‌ల్లిలో (Kyathanpalli) తీవ్ర ఉద్రిక్త‌త కొన‌సాగుతున్న‌ది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ (Balka Suman) ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఆయ‌న‌ను ఏ క్ష‌మైన అదుపులోకి తీసుకునే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు రావ‌డంతో బీఆర్ఎస్ నాయ‌కులు కూడా పెద్ద సంఖ్య‌లో సుమ‌న్ నివాసానికి త‌ర‌లివ‌స్తున్నారు. దీంతో వందలాది మంది పోలీసుల‌ను మోహ‌రించారు. కాగా, సుమ‌న్ నివాసంపై గ‌త రాత్రి గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు డ్రోన్ ఎగుర‌వేశారు.

క్యాతనపల్లి మున్సిపల్ చైర్మ‌న్ ఎన్నిక సంద‌ర్భంగా ఉద్రిక్త‌త నెల‌కొన్న విష‌యం తెలిసిందే. మంత్రి వివేక్‌, ఎంపీ వంశీ సమక్షంలోనే కాంగ్రెస్‌ నేతలు దుశ్శాసన పర్వానికి ఒడిగట్టారు. బీఆర్‌ఎస్‌, సీపీఐ మహిళా కౌన్సిలర్లతో అసభ్యంగా ప్రవర్తించారు. వారిని ఇష్టం వచ్చినట్టు తాకుతూ అధికార మదాన్ని చూపించారు. దీంతో బీఆర్ఎస్ నాయ‌కులు ప్ర‌తిఘ‌టించ‌డంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న‌ది. పోలీసులు లాఠీచార్జీ చేసి వారిని చెద‌గొట్టారు.

[video width="478" height="850" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/02/WhatsApp-Video-2026-02-18-at-9.24.04-AM.mp4"][/video]

కాగా, త‌మ విధుల‌కు ఆటంకం క‌లిగించార‌ని బాల్క సుమన్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సంద‌ర్భంగా తమ విధులకు ఆటంకం కల్పించాడని బాల్క సుమన్, బీఆర్ఎస్ శ్రేణులపై దేవాపూర్ ఎస్‌హెచ్‌వో గంగారాం ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యేతోపాటు మూల రాజిరెడ్డి, గుడిసెల రాజా రమేష్, గాజుల చంద్ర కిరణ్, మేడిపల్లి సంపత్, గోగుల రవీందర్ రెడ్డిలపై రామకృష్ణపూర్ పీఎస్‌లో కేసు నమోదయింది.

Advertisement
Advertisement