Uday Krishna Reddy | పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
Uday Krishna Reddy | మహిళా ట్రైనీ ఐపీఎస్ (Trainee IPS) అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) పరారీలో ఉన్నట్లు. రెండు రోజులుగా ఆయనకు నోటీసులు అందజేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ, హైదరాబాద్‌లో ఆయన పేర్కొన్న రెండు చిరునామాల్లోనూ ఆచూకీ లభించలేదు.
Uday Krishna Reddy | త్రినేత్ర.న్యూస్: మహిళా ట్రైనీ ఐపీఎస్ (Trainee IPS) అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) పరారీలో ఉన్నట్లు. రెండు రోజులుగా ఆయనకు నోటీసులు అందజేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ, హైదరాబాద్‌లో ఆయన పేర్కొన్న రెండు చిరునామాల్లోనూ ఆచూకీ లభించలేదు. దీంతో అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో (SVPNPA) మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత మోతీనగర్‌లోని బంధువుల ఇంట్లో ఆత్మహత్యాప్రయత్నం చేసి, దవాఖాన పాలైనట్లు గత సోమవారం ప్రచారం జరిగింది. అయితే అదంతా నాటకమని, సానుభూతి కోసమే ఇదంతా చేసినట్లు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలినవిషయం తెలిసిందే. రక్త పరీక్షల్లో ఎలాంటి విష పదార్థాలు లేవని, అతిగా మద్యం సేవించడం వల్లే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారని, కేసును పక్కదారి పట్టించడానికే ఈ డ్రామా ఆడారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, ఇరుపక్షాల వాట్సప్ చాటింగ్‌లు, మొబైల్ డేటాను సేకరించి దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఆత్మహత్యాయత్నానికి ముందు సోషల్ మీడియా వేదికగా మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, చట్టంపై తనకు నమ్మకం ఉందని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. ట్రైనీ ఐపీఎస్ బ్యాచ్‌మేట్‌తో ఏడాదిగా సన్నిహితంగా ఉన్నానని, తన వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై షీటీమ్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ai Plus Nova 2 Power 5G | రూ.15,999కే ఏఐ ప్లస్ కొత్త 5జి ఫోన్.. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ..
- ●Bihar Jamui Viral Video | బీహార్‌లో నడిరోడ్డుపై బరితెగింపు: చేతులు జోడించి వేడుకున్నా బాలికపై దాడి.. వీడియో వైరల్
- ●Brahmotsavam 2026 | సూర్యకిరణాల సాక్షిగా శ్రీవారి దివ్య విహారం
- ●Cheetah | విజయవంతంగా ప్రాజెక్టు చీతా.. 71 ఏండ్ల తర్వాత భారత గడ్డపై చీతాల సందడి
- ●Adah Sharma | పదకొండేళ్ల తర్వాత కన్నడ సినిమాలో అదాశర్మ - బిగ్‌బాస్ విన్నర్‌తో మైథాలజీ మూవీ
- ●Digital Arrest | డిజిటల్ అరెస్ట్ మోసాలు.. పూణెలో సీనియర్ సిటిజన్లకు రూ.100 కోట్లు నష్టం..

Ai Plus Nova 2 Power 5G | రూ.15,999కే ఏఐ ప్లస్ కొత్త 5జి ఫోన్.. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ..

Bihar Jamui Viral Video | బీహార్‌లో నడిరోడ్డుపై బరితెగింపు: చేతులు జోడించి వేడుకున్నా బాలికపై దాడి.. వీడియో వైరల్

Brahmotsavam 2026 | సూర్యకిరణాల సాక్షిగా శ్రీవారి దివ్య విహారం

Cheetah | విజయవంతంగా ప్రాజెక్టు చీతా.. 71 ఏండ్ల తర్వాత భారత గడ్డపై చీతాల సందడి






