Police Bike | పోలీసు బైక్‌తో ర్యాపిడో.. ఎస్ఐ కుమారుడి నిర్వాకం..!
Police Bike | అది పోలీస్ బైక్ (Police Bike). స్టేషన్ అవసరాలు, సిబ్బంధి విధుల కోసం ప్రభుత్వం ఇచ్చిన ద్విచక్ర వాహనాన్ని సొంత అవసరానికి వినియోగించుకోవడమే కాక.. ర్యాపిడో రైడ్‌లు (Rapido Ride) కొడుతూ వాటితో డబ్బులు కూడా సంపాదిస్తున్నారు.
Police Bike | త్రినేత్ర.న్యూస్: అది పోలీస్ బైక్ (Police Bike). స్టేషన్ అవసరాలు, సిబ్బంధి విధుల కోసం ప్రభుత్వం ఇచ్చిన ద్విచక్ర వాహనాన్ని సొంత అవసరానికి వినియోగించుకోవడమే కాక.. ర్యాపిడో రైడ్‌లు (Rapido Ride) కొడుతూ వాటితో డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్‌కు చెందిన సిబ్బంది ఘనకార్యం తాజాగా వెలుగులోకి వచ్చింది..
ప్రభుత్వం పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి నాలుగు ద్విచక్ర వాహనాలను ఇస్తున్నది. పోలీసు అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్న సమయంలో మాత్రమే ఆ వాహనాలను వాడుకోవాలి. కానీ వరంగల్ (Warangal) పోలీసు కమిషనరేట్‌లో పోలీసు సిబ్బంది మాత్రం ర్యాపిడోకు కూడా వినియోగిస్తున్నారు. ఇటీవల ఓ ప్రయాణికుడు ర్యాపిడో ద్వారా వరంగల్‌లోని అంబేద్కర్ జంక్షన్ నుంచి సుబేదారి (Subedari) వరకు రైడ్ బుక్ చేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత అతని వద్దకు పోలీసు స్టిక్కర్ ఉన్న బైక్ (Bike Taxi) వచ్చి ఆగింది. దీంతో ఓటీపీ చెప్పి వాహనంపై కూర్చొని సుబేదారి వరకు వెళ్లారు. డబ్బు కూడా చెల్లించారు. తర్వాత ఆ వాహనం గురించి ఆరా తీసిన అతడు.. వీడియో రికార్డు చేశారు. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

అదికాస్తా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆరా తీశారు. ఆ బైక్‌ను వరంగల్ జిల్లా ఎనుమాముల పోలీస్ స్టేషన్‌కు (Enumamula Police Station) కేటాయించినట్లు (TS 09 PC 2795) తేలింది. దానిని ఆ పీఎస్‌లో పనిచేసే ఎస్ఐ వాడుతున్నట్లు తెలిసింది. ఎస్ఐ కుమారుడు దానిని ర్యాపిడోకు వినియోగించినట్లు సమాచారం. దీనిపై సీపీ సమగ్ర విచారణకు ఆదేశించారు.
--> వరంగల్‌లో పోలీస్ బైక్‌పై ర్యాపిడో నడిపిన వ్యక్తి
--> పోలీస్ బైక్‌పై ర్యాపిడో బిజినెస్ చేస్తూ కనిపించిన వ్యక్తి
--> తన బైక్‌ను ఫ్రెండ్ తీసుకెళ్లడంతో పోలీస్ బైక్ వాడినట్లు వివరణ
--> ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంపై ప్రజల ఆగ్రహం
--> ఇలాంటి ఘటనలు పునరావృతం… pic.twitter.com/TMFj9Vufvq
— RTV (@RTVnewsnetwork) August 4, 2026
సంబంధిత వార్తలు

Lord Uday Nagaraju | తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో స్థానం సంపాదించింది: వాసుదేవరెడ్డి
ఆగస్టు 12, 2026

Vinod Kumar, Dayakar Rao | గద్దెను కూల్చినంత ఈజీగా.. ప్రజల మనసుల నుంచి పెద్దిని తీసేయలేరు
ఆగస్టు 10, 2026

KCR | రేపు నర్సంపేటకు కేసీఆర్.. పెద్ది కుటుంబానికి పరామర్శ
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్
- ●Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు
- ●NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..
- ●గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!
- ●Horoscope | ఆగస్టు 13 రాశిఫలాలు.. ఈ రాశి వారు ధన సంపాదనకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు!
- ●Senior Citizen Property Rights India | ఆస్తి తీసుకుని పేరెంట్స్‌ను గాలికి వదిలేసిన కొడుకు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్

Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు

NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..

గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!



