Sabitha Indra Reddy | అసెంబ్లీ వద్ద సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు.. VIDEO
Sabitha Indra Reddy | అసెంబ్లీ సమావేశాల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు చర్చకు దారితీస్తోంది. నల్లచీర ధరించి అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఆమె జుట్టుపట్టుకొని పక్కకు నెట్టేశారు.
Sabitha Indra Reddy | త్రినేత్ర.న్యూస్ : అసెంబ్లీ సమావేశాల వేళ రాష్ట్రంలో రచ్చ మొదలైంది. ప్రతిపక్ష సభ్యులను పోలీసులు గేటు వద్దే అరెస్టు చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీలోకి వెళ్తున్న బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు గేటు వద్దే అడ్డుకుని అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఆమె జుట్టుపట్టుకొని పక్కకు నెట్టేశారు. దీంతో సబితా ఇంద్రారెడ్డి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
అంతకు ముందు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు అమర్యదాగా ప్రవర్తించారు. ఆమె చీర పట్టుకుని లాగారు. దీంతో ఎమ్మెల్యే అని కూడా చూడకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అంటూ సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) ఆవేదన వ్యక్తంచేస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. మరోవైపు అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కింద పడిపోయారు. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కాలికి గాయమైంది. కేటీఆర్ (KTR) చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Former and First female Home Minister in Telugu states
- Served as a Minister three times under different governments
- A six time MLA!
This is how police treated her today when she was at the assembly for wearing a BLACK saree.
She created legacy on her own, worked hard… pic.twitter.com/yPMFeIThYq
— Revathi (@revathitweets) September 7, 2026
Also Read..
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరెస్ట్.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Uttam Kumar Reddy | కేసీఆర్ పాదయాత్ర చేస్తా అంటే జనాలు నవ్వుతున్నారు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సెప్టెంబర్ 7, 2026

Talasani Srinivas Yadav | ప్రతిపక్షాల అరెస్టు అప్రజాస్వామికం.. రాహుల్ ఎన్నోసార్లు నల్లటీషర్టుతో పార్లమెంట్‌కు వెళ్లారు : తలసాని
సెప్టెంబర్ 7, 2026

Vaddiraju Ravichandra | కాంగ్రెస్ ప్రభుత్వ దమననీతిని నిశితంగా గమనిస్తున్న ప్రజలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | కేసీఆర్ పాదయాత్ర చేస్తా అంటే జనాలు నవ్వుతున్నారు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ●Talasani Srinivas Yadav | ప్రతిపక్షాల అరెస్టు అప్రజాస్వామికం.. రాహుల్ ఎన్నోసార్లు నల్లటీషర్టుతో పార్లమెంట్‌కు వెళ్లారు : తలసాని
- ●NSE | ఎన్ఎస్ఈ ప్రీ-ఓపెన్ సెషన్లో కీలక మార్పులు.. నేటి నుంచే కొత్త నిబంధనలు..
- ●CM Vijay | మహిళలను కించపరిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు.. ఉదయనిధి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
- ●Vaddiraju Ravichandra | కాంగ్రెస్ ప్రభుత్వ దమననీతిని నిశితంగా గమనిస్తున్న ప్రజలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి సమయం..?

Uttam Kumar Reddy | కేసీఆర్ పాదయాత్ర చేస్తా అంటే జనాలు నవ్వుతున్నారు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Talasani Srinivas Yadav | ప్రతిపక్షాల అరెస్టు అప్రజాస్వామికం.. రాహుల్ ఎన్నోసార్లు నల్లటీషర్టుతో పార్లమెంట్‌కు వెళ్లారు : తలసాని

NSE | ఎన్ఎస్ఈ ప్రీ-ఓపెన్ సెషన్లో కీలక మార్పులు.. నేటి నుంచే కొత్త నిబంధనలు..

CM Vijay | మహిళలను కించపరిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు.. ఉదయనిధి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై సీఎం స్ట్రాంగ్ వార్నింగ్



