త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS | అసెంబ్లీ గేటు వ‌ద్ద ఉద్రిక్తత‌.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులు

BRS | అసెంబ్లీ (Assembly Session) గేటు వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాల‌న‌కు వ్య‌తిరేకంగా న‌ల్ల టీష‌ర్టులు ధ‌రించి అసెంబ్లీలోకి వెళ్తున్న బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను పోలీసులు అడ్డుకున్నారు.

G

Telangana | Published On Sep 7, 2026, 10.31 am IST

BRS | అసెంబ్లీ గేటు వ‌ద్ద ఉద్రిక్తత‌.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులు
Advertisement

BRS | త్రినేత్ర‌.న్యూస్‌: అసెంబ్లీ (Assembly Session) గేటు వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాల‌న‌కు వ్య‌తిరేకంగా న‌ల్ల టీష‌ర్టులు ధ‌రించి అసెంబ్లీలోకి వెళ్తున్న బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య తోపులాట జ‌రిగింది. పోలీసులు, ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా కేటీఆర్‌, హ‌రీశ్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రోడ్డుపైనే బైఠాయించారు. టీషర్ట్ విప్పి బ‌నియ‌న్‌తో అసెంబ్లీ గేటు ముందు హ‌రీశ్ రావు, అనిల్ జాద‌వ్ కూర్చున్నారు. దీంతో కేటీఆర్‌, హ‌రీశ్ రావును పోలీసులు అరెస్టు చేశారు.

కాగా, అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కింద పడిపోయారు. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కాలికి గాయమైంది. కేటీఆర్ (KTR) చేతికి గాయ‌మైన‌ట్లు తెలుస్తున్న‌ది. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప‌ట్ల పోలీసులు అమ‌ర్య‌దాగా ప్ర‌వ‌ర్తించారు. ఆమె చీర ప‌ట్టుకుని లాగారు. దీంతో ఎమ్మెల్యే అని కూడా చూడకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అంటూ సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) ఆవేదన వ్య‌క్తంచేస్తూ కన్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. స‌బితా ఇంద్రారెడ్డిని పోలీసులు నెట్టివేశారు. నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్తే తప్పేంటి అంటూ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement