త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

POCSO Case | బాలిక‌ల‌తో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. ప్ర‌ధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు న‌మోదు

POCSO Case | అభం శుభం తెలియ‌ని బాలిక‌ల ప‌ట్ల ఓ ప్ర‌ధానోపాధ్యాయుడు( Head Master ) అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. తాక‌రాని చోట ఆ అమ్మాయిల‌ను తాకుతూ లైంగిక వేధింపుల‌కు గురి చేశాడు. బాధిత విద్యార్థినులు( Girl Students ), వారి త‌ల్లిదండ్రుల ఫిర్యాదుతో ప్ర‌ధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు( POCSO Case ) న‌మోదైంది.

S

Telangana | Published On Oct 10, 2026, 6.40 am IST

POCSO Case | బాలిక‌ల‌తో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. ప్ర‌ధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు న‌మోదు
Advertisement

POCSO Case | త్రినేత్ర న్యూస్ : అభం శుభం తెలియ‌ని బాలిక‌ల ప‌ట్ల ఓ ప్ర‌ధానోపాధ్యాయుడు( Head Master ) అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. తాక‌రాని చోట ఆ అమ్మాయిల‌ను తాకుతూ లైంగిక వేధింపుల‌కు గురి చేశాడు. బాధిత విద్యార్థినులు( Girl Students ), వారి త‌ల్లిదండ్రుల ఫిర్యాదుతో ప్ర‌ధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు( POCSO Case ) న‌మోదైంది. అత‌న్ని విధుల నుంచి కూడా డీఈవో( DEO ) స‌స్పెండ్ చేశారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. హ‌నుమ‌కొండ జిల్లాలోని వ‌డ్డేప‌ల్లి ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో న‌రేంద‌ర్ నాయ‌క్.. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. గ‌త కొంత‌కాలం నుంచి 4, 5 త‌ర‌గ‌తులు చ‌దువుతున్న బాలిక‌ల ప‌ట్ల న‌రేంద‌ర్ నాయ‌క్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించి, లైంగికంగా వేధించాడు. బాధిత అమ్మాయిలు జ‌రిగిన అన్యాయాన్ని త‌ల్లిదండ్రుల‌కు చెప్పుకున్నారు. విద్యార్థి సంఘాల‌తో క‌లిసి న‌రేంద‌ర్ నాయ‌క్‌పై డీఈవో ఎల్వీ గిరిరాజ్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టాలని హనుమకొండ ఎంఈవో నెహ్రూనాయక్‌ను డీఈవో ఆదేశించారు. ఆయన నివేదికను డీఈవో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సస్పెండ్‌ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నరేందర్‌ నాయక్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సుబేదారి సీఐ రంజిత్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement