త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murder | హైద‌రాబాద్‌లో రౌడీషీట‌ర్ దారుణ‌హ‌త్య‌

Murder | హైద‌రాబాద్ న‌గ‌రంలో దారుణం జ‌రిగింది. నాగోల్ ప‌రిధిలోని బండ్ల‌గూడ‌లో ఓ వ్య‌క్తిని వేట కొడ‌వ‌ళ్లు, క‌త్తుల‌తో వెంబ‌డించి అత్యంత కిరాత‌కంగా దాడి చేశారు.

S

Telangana | Published On Sep 15, 2026, 6.53 am IST

Murder | హైద‌రాబాద్‌లో రౌడీషీట‌ర్ దారుణ‌హ‌త్య‌
Advertisement

Murder | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో దారుణం జ‌రిగింది. నాగోల్ ప‌రిధిలోని బండ్ల‌గూడ‌లో ఓ వ్య‌క్తిని వేట కొడ‌వ‌ళ్లు, క‌త్తుల‌తో వెంబ‌డించి అత్యంత కిరాత‌కంగా దాడి చేశారు. బాధిత వ్య‌క్తి త‌న ప్రాణాల‌ను కాపాడుకునేందుకు.. చివ‌ర‌కు ఓ వైన్ పాపులోకి ప‌రుగెత్తాడు. అయినా కూడా దుండ‌గులు అత‌న్ని వ‌దిలిపెట్ట‌లేదు. వైన్ షాపులోకి ప్ర‌వేశించిన వారు.. అత‌నిపై క‌త్తుల‌తో దాడి చేసి న‌రికి చంపారు. అనంత‌రం కారులో పరారీ అయ్యారు.

స‌మాచారం అందుకున్న నాగోల్ పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని వివ‌రాలు సేక‌రించారు. మృతుడిని ఇల్లందుకు చెందిన రౌడీషీట‌ర్ న‌యీమ్‌గా పోలీసులు గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

Advertisement
Advertisement