BRS Protest at Yadadri Power Station | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్‌ఎస్ ధర్నా… పోలీసులకు, నేతల మధ్య వాగ్వాదం
BRS Protest at Yadadri Power Station | నల్గొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్‌ఎస్ నేతలు ధర్నాకు దిగారు. కేటీఆర్ పిలుపుతో జగదీశ్‌రెడ్డితో కలిసి నేతలు వైటీపీఎస్ పరిశీలనకు వెళ్లారు.
BRS Protest at Yadadri Power Station | త్రినేత్ర న్యూస్: నల్గొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్‌ఎస్ నేతలు ధర్నాకు దిగారు. కేటీఆర్ పిలుపుతో జగదీశ్‌రెడ్డితో కలిసి నేతలు వైటీపీఎస్ పరిశీలనకు వెళ్లారు. ఈ ధర్నాతో ప్లాంట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఒకానొక సమసయంలో బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. లోపలికి అనుమతించకపోవడంతో రోడ్డుపైనే బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులకు వెంటనే 24 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మణుగూరులో పవర్‌స్టేషన్ ముందు బైఠాయింపు..
మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు థర్మల్ పవర్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. పవర్ స్టేషన్‌లోకి బీఆర్ఎస్ నేతలను పోలీసులు అనుమతించకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత
పవర్ ప్లాంట్ సందర్శనకు వెళ్ళిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకుల బృందాన్ని అడ్డుకున్న పోలీసులు
పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం pic.twitter.com/mFMVbxpRNd
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2026
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు థర్మల్ పవర్ స్టేషన్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ బృందం
🔴 పవర్ స్టేషన్‌లోకి బీఆర్ఎస్ నేతలను అనుమతించని పోలీసులు
🔴 పవర్ స్టేషన్ ముందు నిరసనకు దిగిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు… pic.twitter.com/xhii0AnFai
— BRS Party (@BRSparty) September 24, 2026
తాజావార్తలు
- ●PB Fintech | ఐఆర్డీఏఐ చర్యల ఎఫెక్ట్.. పాలసీబజార్‌కు భారీ షాక్.. 28 శాతం పతనమైన షేర్..
- ●Enquiry Committee on Lands | కేసీఆర్, కేటీఆర్, హరీశ్ భూములపై తేల్చండి.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- ●PM Modi | సేవే ప్రధాన లక్ష్యం కావాలి : ప్రధాని మోదీ
- ●Danam Nagender | దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- ●NSE IPO | ఎన్ఎస్ఈ షేర్లకు అదిరిపోయే ర్యాలీ.. 5 శాతం జంప్.. ప్రాఫిట్ బుక్ చేయాలా..?
- ●Romantic OTT | తనకంటే వయసులో చిన్నవాడైన హీరోతో నయనతార రొమాన్స్ - ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ

PB Fintech | ఐఆర్డీఏఐ చర్యల ఎఫెక్ట్.. పాలసీబజార్‌కు భారీ షాక్.. 28 శాతం పతనమైన షేర్..

Enquiry Committee on Lands | కేసీఆర్, కేటీఆర్, హరీశ్ భూములపై తేల్చండి.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

PM Modi | సేవే ప్రధాన లక్ష్యం కావాలి : ప్రధాని మోదీ

Danam Nagender | దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు






