Palla Rajeshwar Reddy | 52 వేల కోట్ల బాకీ కట్టు.. రైతులకు కరెంటు ఇవ్వు
Palla Rajeshwar Reddy | సింగరేణి బొగ్గును ఏపీ, కర్ణాటకకు అమ్ముతూ.. తెలంగాణకు మొండి చేయి చూపిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు.
- కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్‌లో రెండూ బంజేసిండు.. మేం వస్తే ఈరోజు నడుపుతరట
- ఇన్ని రోజలు ఏం పీకుతున్నవ్
- కాంగ్రెస్ సర్కార్‌పై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫైర్
త్రినేత్ర న్యూస్: సింగరేణి బొగ్గును ఏపీ, కర్ణాటకకు అమ్ముతూ.. తెలంగాణకు మొండి చేయి చూపిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్‌లో రెండూ స్టేషన్లు బంజేశారని.. ఈరోజు మేం వస్తే నడుపుతారటని చెప్పారు. 52 వేల కోట్ల బాకీ కట్టి రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
లేని బొగ్గును లెక్కల్ల పెట్టిండ్రు..
ఆనాడు భూపాలపల్లి నుంచి ఒక్కరోజు కూడా బొగ్గు తక్కువ ఇవ్వలే. ఇవ్వాళ బొగ్గు 52 వేల కోట్ల రూపాయలు జెన్కో బాకీ వడ్డది. సింగరేణివాడు 40 లక్షల టన్నుల బొగ్గు ఉన్నదని చెప్పి పేపర్లల్ల రాసిండు. కానీ లేని బొగ్గును ఉన్నట్లు లెక్కలు చూపిచ్చిండు. 52 వేల కోట్ల బాకీ తేరేదాకా సరిగా ఇవ్వమని చెప్పేసి నాణ్యమైన బొగ్గును ఆంధ్రప్రదేశ్ కు, కర్ణాటకకు అమ్ముతడు.. కానీ మనకు అమ్మట్లేదు, మనకు ఇవ్వట్లేదు. కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్‌కు సింగరేణి ఇవ్వాల్సిన 5 వేల టన్నులకు కేవలం 1500 టన్నులే ఇస్తున్నరు. మరి ఎట్ల నడుస్తది?
ఇక్కడ 500 మెగావాట్ల స్టేషన్ ఉంది. 600 మెగావాట్లది ఇంకోటి ఉన్నది. బొగ్గు ఇవ్వట్లేదు. యాదాద్రిలో మొత్తం స్టేషన్లు షటాఫ్ చేసిండ్రు. భద్రాద్రి దగ్గర కూడా మొత్తం బంజేసిండు. సగానికి సగం మూత వెట్టిండు. ఇవ్వాళ కాకతీయ పవర్ స్టేషన్‌కు మనం వచ్చినం కాబట్టి రెండు నడుపుతడట. ఇక్కడి నుంచి మనం పోయినంక షట్‌డౌన్ చేస్తడట.
గోదావరి నీళ్లెత్తే తెలివి లేదు..
పవర్ మినిస్టర్ మొత్తం కమీషన్ల మీద వడ్డడు. రెవెన్యూ, ఇన్‌చార్జ్ మినిస్టర్ 30 శాతం భూముల మీద వడ్డడు. ముఖ్యమంత్రేమో వీళ్లకొచ్చిన వాటాల మీద వడ్డడు. అంతేకానీ రైతులకు 24 గంటలు కరెంటు ఇవ్వలే. కర్ణాటకలో కరెంటొస్తే నీళ్లొస్తయ్. ఆంధ్రాలో రిజర్వాయర్లు మొత్తం నిండుతయ్. గోదావరి నీళ్లు పోతుంటయ్. కానీ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎత్తే సోయి లేదు. గోదావరి నీళ్లు ఎత్తుకునే తెలివి లేదు.
రైతుల ఉసురు తీస్తున్నరు..
ఒక్కరోజన్నా సమీక్ష చేసిర్రా. సమ్మక్క సాగర్‌లో ఇయ్యాళ లక్ష క్యూసెక్కుల నీళ్లు పోతున్నయ్. పైన కాళేశ్వరం ఎత్తితే కేసీఆర్‌కు పేరొస్తదన్నరు. మరి దేవాదుల దగ్గర 12 మోటార్లు ఉన్నయ్ కదా. 48 కిలోమీటర్ల టన్నెల్ తవ్వింది కూడా కేసీఆరే కదా. మూడు సంవత్సరాల్లో ఒక్క కాల్వ తవ్వలే. తట్టెడు మట్టి తియ్యలే. ఒక్క మోటర్ వెట్టలే. ఒక్క ఎకరం కూడా తడవలే. కరెంటు లేదన్న పేరు మీద నీళ్లు ఎత్తుతలేరు. అన్నింటికి మూలం కరెంటు. ఆ కరెంటు కావాలంటే బొగ్గు కావాలి. రైతాంగం అల్లాడిపోతుంది. ఉన్న నీళ్లను కనీసం తోడుకుందామంటే రైతుల ఉసురు తీస్తున్నరు.
రైతాంగం ప్రతి ఊర్లో పోరాటానికి సిద్ధమైండ్రు. పెట్టిన సగం వరి కూడా పండుతదో లేదో. కాబట్టి ఉన్న 52 వేల కోట్ల బకాయి వెంటనే కట్టు. ఉన్న బొగ్గును తీసుకొని ప్లాంట్లను నడిపించు. చేతనైతే ఈ పని చెయ్. మోటార్లు రెడీ ఉన్నయ్.. నీళ్లున్నయ్.. కాలువలు ఉన్నయ్.. నీది చేతనైన, రైతు ప్రభుత్వం అయితే నీళ్లు ఇవ్వు. నువ్ కొత్తగా ఏం చేయనవసరం లేదు.
ఏం పీకినవ్?
రైతు బీమా, రైతు బంధుతో పాటు అన్నీ మూలకు పెట్టినవ్. నీ అంత రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎవడు లేడు. రెవెన్యూ మినిస్టర్ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకరే. మీ సంగతి ఒదిలిపెట్టేది లేదు. కుక్క బెదిరిచ్చి చెప్పు ఎత్కపోయిందట.. కేసీఆర్ మీద, మా మీద రాళ్లేస్తున్నవ్. ప్రభుత్వం నీది.. నువ్ ఏం చేసుకుంటవో చేస్కో.. ఛాలెంజ్ చేస్తున్నం. మాకు అక్రమంగా ఏదైనా వచ్చినట్టుంటే చూడు.. ఒకవేళ సిగ్గు, శరం నీకుంటే, చీము నెత్తురు ఉంటే కనీసం ముక్కు నేలకు రాయి. డైవర్షన్ పాలిటిక్స్ ఆపేయ్. మూడేళ్లలో పంట నష్టం ఇస్తా అని ఇయ్యలే. ఏం పీకినవ్ అని తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

BRS Protest at Yadadri Power Station | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ ధర్నా… పోలీసులకు, నేతల మధ్య వాగ్వాదం
సెప్టెంబర్ 24, 2026

Heavy Rain | రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
సెప్టెంబర్ 24, 2026

Adilabad | రిమ్స్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
సెప్టెంబర్ 23, 2026
తాజావార్తలు
- ●BRS Protest at Yadadri Power Station | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ ధర్నా... పోలీసులకు, నేతల మధ్య వాగ్వాదం
- ●PB Fintech | ఐఆర్డీఏఐ చర్యల ఎఫెక్ట్.. పాలసీబజార్‌కు భారీ షాక్.. 28 శాతం పతనమైన షేర్..
- ●Enquiry Committee on Lands | కేసీఆర్, కేటీఆర్, హరీశ్ భూములపై తేల్చండి.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- ●PM Modi | సేవే ప్రధాన లక్ష్యం కావాలి : ప్రధాని మోదీ
- ●Danam Nagender | దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- ●NSE IPO | ఎన్ఎస్ఈ షేర్లకు అదిరిపోయే ర్యాలీ.. 5 శాతం జంప్.. ప్రాఫిట్ బుక్ చేయాలా..?

BRS Protest at Yadadri Power Station | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ ధర్నా... పోలీసులకు, నేతల మధ్య వాగ్వాదం

PB Fintech | ఐఆర్డీఏఐ చర్యల ఎఫెక్ట్.. పాలసీబజార్‌కు భారీ షాక్.. 28 శాతం పతనమైన షేర్..

Enquiry Committee on Lands | కేసీఆర్, కేటీఆర్, హరీశ్ భూములపై తేల్చండి.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

PM Modi | సేవే ప్రధాన లక్ష్యం కావాలి : ప్రధాని మోదీ



