త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pocharam Srinivas Reddy | ఎల్‌నినో ప్ర‌భావం.. యాసంగిలో రెండో పంట వేయొద్దు..: ఎమ్మెల్యే పోచారం

Pocharam Srinivas Reddy | యాసంగిలో (Yasangi Season) రెండో పంట వేయ‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వ వ్య‌వ‌సాయ స‌ల‌హాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) రైతుల‌కు సూచించారు. ఎల్‌నినో ప్ర‌భావంతో పంట‌లు పండే ప‌రిస్థితి లేద‌ని చెప్పారు.

G

Telangana | Published On Oct 8, 2026, 12.22 pm IST

Pocharam Srinivas Reddy | ఎల్‌నినో ప్ర‌భావం.. యాసంగిలో రెండో పంట వేయొద్దు..: ఎమ్మెల్యే పోచారం
Advertisement

Pocharam Srinivas Reddy | త్రినేత్ర న్యూస్‌: యాసంగిలో (Yasangi Season) రెండో పంట వేయ‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వ వ్య‌వ‌సాయ స‌ల‌హాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) రైతుల‌కు సూచించారు. ఎల్‌నినో ప్ర‌భావంతో పంట‌లు పండే ప‌రిస్థితి లేద‌ని చెప్పారు. నిజాం సాగర్‌లో (Nizamsagar) ప్రస్తుతం 8 టీఎంసీల నీరు మాత్రమే ఉందని.. ఒక పంటకు 12 టీఎంసీలు అవసరమని వెల్ల‌డించారు. రెండో పంటకు సాగునీరు విడుదల చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

మ‌రోవైపు ఎల్‌నినో (El Nino) ప్రభావంతో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ఈ యాసంగి సీజ‌న్‌లో వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి వనరులతో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌ అధికారులను ఆదేశించిన విష‌యం తెలిసిందే. స్వల్పకాలిక రకాలైన పప్పు ధాన్యాలు, నూనె గింజలతోపాటు అధిక ఆదాయాన్నిచ్చే కూరగాయల పంటలు సాగు చేయాలని సూచించారు. రైతులకు అందుబాటులో ఉన్న నీటి వనరులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించి, యాసంగి సీజన్‌లో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కాగా, ఎల్‌నిన్ ప్ర‌భావంతో వానాకాలం సీజ‌న్‌లో రాష్ట్ర వ్యాప్తంగా సాధార‌ణం కంటే త‌క్కువ వ‌ర్షపాతం న‌మోదైన విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement