Aurora College | విద్యార్థినులు బట్టలు మార్చుకుంటుండగా ఫొటోలు.. అరోరా కాలేజీ హాస్టల్‌లో సిబ్బంది అరాచకాలు
Aurora College | యాదాద్రి జిల్లా భువనగిరిలోని అరోరా కాలేజీ (Aurora College) హాస్టల్‌లో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్‌లో (College Hostel) విద్యార్థినులు దుస్తులు మార్చుకుంటుండగా సిబ్బంది రహస్యంగా ఫొటోలు తీస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
Aurora College | త్రినేత్ర న్యూస్: యాదాద్రి జిల్లా భువనగిరిలోని అరోరా కాలేజీ (Aurora College) హాస్టల్‌లో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్‌లో (College Hostel) విద్యార్థినులు దుస్తులు మార్చుకుంటుండగా సిబ్బంది రహస్యంగా ఫొటోలు తీస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అశ్లీల ఫొటోలను స్టూడెంట్స్‌కు చూపిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అమ్మాయిలను సెట్ చేస్తా అంటూ హాస్టల్ వార్డెన్ అనుచరుడు పుథ్వి.. విద్యార్థుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఓ బాధిత విద్యార్థిని.. పృథ్వీ ఆగడాల గురించి తన తండ్రికి చెప్పుకుంటూ వాపోయిన ఆడియో వైరల్ అయింది.

దీంతో హాస్టల్ నిర్వాహకుల ఆగడాలపై విద్యార్థులు, ప్రజాసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి కాలేజీ ముందు పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. హాస్టల్ సిబ్బంది నిర్వాకంపై ఆగ్రహానికి లోనైన విద్యార్థులు కాలేజీ ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మెస్ ఇన్‌చార్జి, వార్డెన్ మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులను శాంతిపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న జోష్.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు..
- ●Amazon Great Indian Festival 2026 | అమెజాన్ సేల్‌లో ఐఫోన్ 16, 17ఈ లపై భారీ డిస్కౌంట్లు.. ఎంత తగ్గాయంటే..?
- ●Jio Platforms IPO | అక్టోబర్ 21న జియో ఐపీఓ.. షేర్ ధర రూ.1,119..?
- ●Suicide | బావిలో దూకి.. ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలవన్మరణం
- ●CJP Protest | ఢిల్లీలో అప్రకటిత కర్ఫ్యూ.. రాత్రికి రాత్రే 400 మందికిపైగా అరెస్ట్
- ●Special Trains | సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్-హైదరాబాద్ మార్గంలో 34 ప్రత్యేకరైళ్లు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న జోష్.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు..

Amazon Great Indian Festival 2026 | అమెజాన్ సేల్‌లో ఐఫోన్ 16, 17ఈ లపై భారీ డిస్కౌంట్లు.. ఎంత తగ్గాయంటే..?

Jio Platforms IPO | అక్టోబర్ 21న జియో ఐపీఓ.. షేర్ ధర రూ.1,119..?

Suicide | బావిలో దూకి.. ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలవన్మరణం





