త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Rammohan Reddy | పరిగిలో కేటీఆర్‌ మీటింగ్.. లేచి వెళ్లిపోయిన జ‌నం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

MLA Rammohan Reddy | బీఆర్ఎస్ (BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (KTR) ప‌రిగి ఎమ్మెల్యే రామ్మోహ‌న్ రెడ్డి (MLA Rammohan Reddy) విమ‌ర్శ‌లు గుప్పించారు. గురువారం కేటీఆర్ ప‌రిగిలో (Parigi) మీటింగ్ పెడితే జ‌నాలు లేచి వెళ్లిపోయార‌ని చెప్పారు.

G

Telangana | Published On Jun 27, 2026, 1.17 pm IST

MLA Rammohan Reddy | పరిగిలో కేటీఆర్‌ మీటింగ్.. లేచి వెళ్లిపోయిన జ‌నం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
Advertisement

MLA Rammohan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ (BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (KTR) ప‌రిగి ఎమ్మెల్యే రామ్మోహ‌న్ రెడ్డి (MLA Rammohan Reddy) విమ‌ర్శ‌లు గుప్పించారు. గురువారం కేటీఆర్ ప‌రిగిలో (Parigi) మీటింగ్ పెడితే జ‌నాలు లేచి వెళ్లిపోయార‌ని చెప్పారు. వారిని బ‌తిమిలాడినా ఆగ‌లేద‌ని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలోని కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్షం కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌త ప‌దేండ్ల‌లో 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశార‌ని మండిప‌డ్డారు. అధికారంలోకి వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా పూర్తి చెయ్యలేద‌న్నారు.

ప‌రిగికి నీళ్లు ఇస్తామ‌ని ఐదు చెప్పార‌ని, చివ‌రికి మొండి చెయ్యి చూపించార‌ని విమ‌ర్శించారు. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామ‌ని చెప్పి.. ఒక్క ఎకరానికి కూడా ఇవ్వలేదని మండిప‌డ్డారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ అన్నార‌ని, కనీసం ఒక్కటి కూడా కట్టలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామ‌ని చెప్పార‌న్నారు. త‌మ ప్ర‌భుత్వంలో రాష్ట్ర‌ వ్యాప్తంగా లక్షల ఇందిరమ్మ ఇండ్లు ( Indiramma Indlu) ఇస్తున్నామ‌ని చెప్పారు.

పరిగిలో లక్ష్మీ దేవుల పల్లె ప్రాజెక్టును కడతామ‌ని తట్టెడు మట్టి కూడా తీయలేదని మండిప‌డ్డారు. కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వంలో ప్రాజెక్ట్ కోసం భూ సేకరణ కూడా పూర్తిచేశామ‌న్నారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హయంలో మహిళలను పట్టించుకోలేద‌ని, తాము వారికి పెద్ద పీట వేశామ‌ని చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత అందిస్తున్న‌ద‌ని తెలిపారు. రూ.60 వేల కోట్లు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామ‌న్నారు.

అప్ప జంక్టన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్ల‌ రోడ్ వస్తుంటే.. దానిని గ్రీన్ ట్రిబ్యునల్‌లో (Green Tribunal) పెండింగ్ పడితే పరిష్కరించలేద‌ని విమ‌ర్శించారు. త‌మ‌ ప్రభుత్వం వచ్చాక రూ.1000 కోట్ల వ్యయంతో ఆ రోడ్డు నిర్మాణం శర వేగంగా కొనసాగుతున్న‌ద‌ని చెప్పారు. హైదరాబాద్‌కు ఒక ల్యాండ్ మార్క్ సెట్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిద‌ని తెలిపారు. రూ.50 వేల కోట్లతో పరిగి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్ల‌డించారు. కానీ కేటీఆర్‌కు, బీఆర్ఎస్ వాళ్ల‌కు ఆ అభివృద్ధి కనిపించడం లేదని మండిప‌డ్డారు. కేటీఆర్ గంటకొక మాట మాట్లాడుతాడ‌ని విమ‌ర్శించారు. గతంలో కూడా తెలంగాణలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని కేటీఆర్ అన్నార‌ని ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement