Laptop | మ్యాక్‌బుక్ వర్సెస్ థింక్‌ప్యాడ్.. ఏ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలి..?
Laptop | ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయడంలో చాలా మందికి అనేక సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా అధునాతన ఎం సిరీస్ చిప్‌లు కలిగిన మ్యాక్‌బుక్‌లను కొనాలా, లేక విండోస్, లైనక్స్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లకు చెందిన ల్యాప్‌టాప్‌లను కొనాలా.. అని చాలా మంది ఆలోచిస్తుంటారు.
Technology | Published On Jun 27, 2026, 3.26 pm IST
Laptop | ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయడంలో చాలా మందికి అనేక సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా అధునాతన ఎం సిరీస్ చిప్‌లు కలిగిన మ్యాక్‌బుక్‌లను కొనాలా, లేక విండోస్, లైనక్స్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లకు చెందిన ల్యాప్‌టాప్‌లను కొనాలా.. అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే పనితీరు, అవసరాలను బట్టి ల్యాప్‌టాప్‌లను తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మ్యాక్‌బుక్‌లు ఫొటో, వీడియో ఎడిటింగ్ కోసమే కాకుండా డెవలపర్లకు కూడా పనిచేస్తాయని, లైనక్స్ అయితే నెట్‌వర్కింగ్, డెవ్ టూల్స్ వంటి పనులు నిర్వహించడానికి పనిచేస్తాయని, వీటిని డెవలపర్లు, ఐటీ ప్రొఫెషనల్స్ తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా ల్యాప్‌టాప్ లను కొనేముందు చాలా మంది వాటిని ఏ పని నిమిత్తం కొనుగోలు చేస్తున్నామన్న విషయాన్ని ఆలోచించరు. దీంతో పనికి సరిపోని డివైస్‌లనే చాలా మంది కొంటుంటారు. తరువాత బాధపడుతుంటారు. కానీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ల్యాప్ టాప్‌లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
క్రియేటివ్ వర్క్ కోసం..
యాపిల్‌కు చెందిన మ్యాక్‌బుక్ సిరీస్ ల్యాప్‌టాప్‌లు క్రియేటివ్ వర్క్ కోసం అద్భుతంగా పనిచేస్తాయి. లేటెస్ట్‌గా ఎం5 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్‌లు అందుబాటులో ఉన్నాయి. ధర అంత పెట్టలేమని భావిస్తే, దాదాపు అంతే ప్రదర్శన ఇచ్చే ఎం4 సిరీస్ ల్యాప్‌టాప్‌లను కూడా యూజర్లు ఎంచుకోవచ్చు. అయితే మ్యాక్‌బుక్‌లు ఫొటో, వీడియో ఎడిటింగ్ కోసం అద్భుతంగా పనిచేస్తాయి. కలర్స్ క్వాలిటీని గుర్తించడం, డిస్‌ప్లే క్వాలిటీ, సౌండ్ వంటి అంశాలు వీటిల్లో ప్రధానంగా ఉంటాయి. కనుక క్రియేటివ్ వర్క్‌కు ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇక ఇప్పటికే ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ వంటి ఉత్పత్తులు ఉన్నవారు యాపిల్ ఎకో సిస్టమ్‌ను ఇష్టపడితే మ్యాక్‌బుక్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇవి డెవలపర్లకు సైతం పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.
డెవలపర్లు, ప్రొఫెషనల్స్ అయితే..
లెనోవోకు చెందిన థింక్ ప్యాడ్ మోడల్స్‌లో సాధారణంగా లైనక్స్‌ను ఇస్తారు. ఇవి లైనక్స్, నెట్ వర్కింగ్, డెవ్ టూల్స్ కోసం పనిచేస్తాయి. వాటిని ఆయా ల్యాప్‌టాప్‌లలో నేరుగా రన్ చేయవచ్చు. ఎక్కువగా డెవలపర్లు, ఐటీ ప్రొఫెషనల్స్‌కు థింక్ ప్యాడ్ ల్యాప్‌టాప్‌లు ఉపయోగపడతాయి. వీటిల్లో ర్యామ్, ఎస్ఎస్‌డీలను సులభంగా అప్‌గ్రేడ్ చేయవచ్చు. బ్యాటరీ రీప్లేస్‌మెంట్ సైతం ఈజీగా ఉంటుంది. ఫిజికల్ పోర్టులు ఎక్కువ. ఎంటర్ ప్రైజ్ గ్రేడ్ సెక్యూరిటీ, మన్నిక లభిస్తాయి. అందువల్ల ఆ ఫీచర్లు కావాలనుకునే వారు థింక్ ప్యాడ్ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక విండోస్ ల్యాప్ టాప్‌లలోనూ మ్యాక్, లైనక్స్‌కు చెందిన అనేక పనులను నిర్వహించవచ్చు. కానీ ఇటీవలి కాలంలో మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లపై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. బగ్స్ అధికంగా ఉండడంతోపాటు అప్ డేట్స్ చేసుకోవాలని నిరంతరం నోటిఫికేషన్లను పంపించడం, కొద్ది నెలలు గడిచాక తరచూ బ్లూ స్క్రీన్ లేదా ఎర్రర్ మెసేజ్‌లు కనిపించి పీసీని రీస్టార్ట్ చేయాల్సి రావడం వంటి సమస్యలు వస్తున్నాయి. అందువల్ల చాలా మంది విండోస్‌ను వాడాలంటే వెనుకడుగు వేస్తున్నారు. అయితే వ్యక్తిగతంగా అవసరం ఉంటే తప్ప విండోస్‌ను వాడకపోవడమే మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
ఏయే మోడల్స్ ఉన్నాయి..
మార్కెట్‌లో ప్రస్తుతం మ్యాక్‌బుక్ ఎయిర్ 15, ఎయిర్ 13, మ్యాక్‌బుక్ నియో 13 ల్యాప్‌టాప్‌లు బడ్జెట్ ధరల్లో అందుబాటులో ఉండగా, ఎయిర్ ల్యాప్‌టాప్‌లలో అధునాతన ఎం5 చిప్ లభిస్తుంది. ధర ఎక్కువ అనుకుంటే ఎం4 చిప్ ఉన్నవి కూడా కొనుగోలు చేయవచ్చు. అలాగే మ్యాక్‌బుక్ నియో సైతం తక్కువ బడ్జెట్‌లోనే అనేక మంది వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇక లెనోవో థింక్ ప్యాడ్ మోడల్స్ ఎల్14, ఈ14, ఈ16 ప్రస్తుతం వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయి. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ల్యాప్‌టాప్ లను కొనుగోలు చేస్తే దీర్ఘకాలంలో నాణ్యమైన పనితీరును పొందడంతోపాటు ఎలాంటి సమస్యలు లేకుండా సులభంగా పనులు కొనసాగించేందుకు అవకాశాలు ఉంటాయి.
సంబంధిత వార్తలు

Laptop Catches Fire | విమానం ల్యాండ్ అవుతుండగా.. ల్యాప్‌టాప్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
ఆగస్టు 23, 2026

POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
ఆగస్టు 5, 2026

OnePlus | వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●Varanasi Movie | యాభై భాషల్లో మహేష్‌బాబు వారణాసి రిలీజ్ - రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్
- ●Gachibowli Building Collapse | టౌన్‌ప్లానింగ్ అధికారిపై వేటు.. బిల్డర్‌పై కేసు.. అంజయ్యనగర్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
- ●Mobile Phone | సెల్‌ఫోన్ మిస్సింగ్.. కర్రలు, చెప్పులు, బకెట్లతో కొట్టుకున్న ఆంధ్ర, మణిపూర్ విద్యార్థినులు
- ●Free Travel for Women | రాఖీపౌర్ణమి కానుక.. మహిళలతోపాటు మరొకరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- ●Nayanthara | నయనతార ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే? - సీక్రెట్ రివీల్ చేసిన లేడీ సూపర్ స్టార్
- ●Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ అప్‌గ్రేడ్.. ఇక 24 బోగీలతో పరుగులు..!

Varanasi Movie | యాభై భాషల్లో మహేష్‌బాబు వారణాసి రిలీజ్ - రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్

Gachibowli Building Collapse | టౌన్‌ప్లానింగ్ అధికారిపై వేటు.. బిల్డర్‌పై కేసు.. అంజయ్యనగర్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

Mobile Phone | సెల్‌ఫోన్ మిస్సింగ్.. కర్రలు, చెప్పులు, బకెట్లతో కొట్టుకున్న ఆంధ్ర, మణిపూర్ విద్యార్థినులు

Free Travel for Women | రాఖీపౌర్ణమి కానుక.. మహిళలతోపాటు మరొకరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం



