Dharmendra Pradhan | రాజకీయ ప్రయోజనాల కోసం యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు.. రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు
Dharmendra Pradhan | ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Dharmendra Pradhan | ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని, యువతలో భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
సీఎన్ఎన్-న్యూస్18కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. "విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో నేను రాజకీయం చేయాలనుకోవడం లేదు. కానీ పరీక్షకు కేవలం కొన్ని రోజుల ముందు కోటా (Kota)లో ర్యాలీ నిర్వహించాలనే ప్రతిపక్షాల నిర్ణయం సరైనది కాదు. యువత మనసులో రాహుల్ భయాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. ఆయన నీట్ అభ్యర్థులను తప్పుదోవ పట్టించారు. యువతరం మనసులో భయాన్ని నింపకండి. వారిని తప్పుదోవ పట్టించకండి. వారి పట్ల మనందరికీ బాధ్యత ఉంది. ప్రతిపక్షాలు, రాహుల్ గాంధీ.. విద్యార్థుల విషయంలో రాజకీయం చేయడం మానుకోవాలి" అని ఆయన అన్నారు.
సాయుధ బలగాలను ఉపయోగిస్తే తప్పేంటి..?
ఇక నీట్ రీ ఎగ్జామ్ సమయంలో సాయుధ బలగాలను ఉపయోగించారంటూ కేంద్రంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రధాన్ కౌంటర్ ఇచ్చారు. దేశ యువత కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సీఏపీఎఫ్ (CAPF)లను ఉపయోగిస్తే తప్పేంటి..? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌కు ప్రశ్నించే హక్కు లేదు..
అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ర్యాలీ కారణంగా కొందరు విద్యార్థులు తమ పరీక్షా కేంద్రానికి చేరుకోవడంలో ఇబ్బందులు పడిన ఘటనను ప్రస్తావించారు. "ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే నిర్వహించిన ర్యాలీ, ట్రాఫిక్ ఆంక్షల వల్ల ముగ్గురు విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. ఆ తర్వాత ఆయన వారికి క్షమాపణలు చెప్పారు. అలాంటి వారు పరీక్షల నిర్వహణపై మాకు నీతులు చెప్పడమేంటి..?" అని మంత్రి ప్రశ్నించారు. బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ ర్యాలీ కారణంగా కొందరు విద్యార్థులు NEET-UG రీ-ఎగ్జామ్ కేంద్రాలకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. భారీ ట్రాఫిక్ జామ్ వల్ల నిమిషం ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది.
సీజేపీ.. రాహుల్ బి-టీమ్
నీట్ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీ, విద్యార్థుల ఆత్మహత్యలపై కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలపై కూడా ధర్మేంద్ ప్రధాన్ స్పందించారు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని చెప్పారు. అయితే, దీని వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఎవరన్నది ప్రశ్న...? అని పేర్కొన్నారు. సీజేపీ అనేది రాహుల్ బీ టీమ్ అని మంత్రి ఆరోపించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●River disputes | కేంద్రం డైరెక్షన్ లో కొత్త నీళ్ల ఒప్పందాలు
- ●Janhvi Kapoor | ఓటీటీలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ - డెబ్యూ వెబ్‌సిరీస్‌లో కోసం కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ - హీరోల కంటే ఎక్కువే
- ●Switzerland vs Canada | ఓడినా తొలిసారి నాకౌట్‌కు కెనడా ఎంట్రీ.. గ్రూప్ టాపర్‌గా స్విట్జర్లాండ్
- ●Stock Markets | ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన పెట్టుబడిదారులు..
- ●SEBI | ఫిన్ఫ్లూయెన్సర్లకు సెబీ కొత్త షాక్.. 5 లక్షల ఫాలోవర్లు దాటితే స్పాన్సర్డ్ కంటెంట్ రూల్స్ మరింత కఠినం..
- ●Sukumar Wife | నేను పక్కా తెలంగాణ అమ్మాయినే - డైరెక్టర్ సుకుమార్ భార్య కామెంట్స్

River disputes | కేంద్రం డైరెక్షన్ లో కొత్త నీళ్ల ఒప్పందాలు

Janhvi Kapoor | ఓటీటీలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ - డెబ్యూ వెబ్‌సిరీస్‌లో కోసం కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ - హీరోల కంటే ఎక్కువే

Switzerland vs Canada | ఓడినా తొలిసారి నాకౌట్‌కు కెనడా ఎంట్రీ.. గ్రూప్ టాపర్‌గా స్విట్జర్లాండ్

Stock Markets | ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన పెట్టుబడిదారులు..






