Bhagyaraj | ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం – పెళ్లైన రెండేళ్లకే భార్య మరణం – సినిమా కథలాగే భాగ్యరాజ్ జీవితం
దిగ్గజ నటుడు భాగ్యరాజ్ మరణంతో తమిళ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. రెండు రోజుల క్రితం ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో హుషారుగా కనిపించిన ఆయన హఠాత్తుగా కన్నుమూయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా భాగ్యరాజ్ వ్యక్తిగత జీవితం సినిమాలకు మించి ట్విస్ట్‌లతో సాగింది. ఓ హీరోయిన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు భాగ్యరాజ్. కానీ ఆమె మరణించడంతో మరో నాయికతో ఏడడుగులు వేశాడు.
Entertainment | Published On Jun 27, 2026, 3.02 pm IST
Bhagyaraj | తమిళ దిగ్గజ దర్శకనటుడు భాగ్యరాజ్ వ్యక్తిగత జీవితం కూడా అచ్చం సినిమా మాదిరిగానే ట్విస్ట్‌లు, టర్న్‌లతో సాగింది. ఓ హీరోయిన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు భాగ్యరాజ్. కానీ పెళ్లైన రెండేళ్లకే ఆమె మరణించింది. ఆ తర్వాత తన సినిమాలో నటించిన మరో కథానాయికతో ప్రేమలో పడిన భాగ్యరాజ్ ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు.
భార్య సహకారంతోనే...
1970- 80 దశకంలో తమిళం, మలయాళ భాషల్లో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ప్రవీణతో ప్రేమలో పడ్డారు భాగ్యరాజ్. స్వతహాగా మలయాళ నటి అయిన ప్రవీణ... కే బాలచందర్ దర్శకత్వం వహించిన మన్మథలీలై మూవీతో కథానాయికగా అరంగేట్రం చేసింది. తమిళంలో సినిమాలు చేస్తోన్న టైమ్‌లోనే భాగ్యరాజ్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సహాయనటుడిగా ఉన్న చిన్న చిన్న పాత్రలు చేస్తోన్న భాగ్యరాజ్.... ప్రవీణ వల్లే హీరోగా, డైరెక్టర్‌గా అవకాశాలు అందుకున్నారు. 1981లో భాగ్యరాజ్, ప్రవీణ పెళ్లిచేసుకున్నారు. పెళ్లైన రెండేళ్లకే కామెర్ల వ్యాధితో ప్రవీణ కన్నుమూసింది. ప్రవీణ తెలుగులో సీతాపతి సంసారం అనే తెలుగు సినిమా చేసింది.
ఏడాదికే...
మొదటి భార్య చనిపోయిన తర్వాత ఏడాదే హీరోయిన్ పూర్ణిమ జయరామ్‌తో ఏడడుగులు వేశారు భాగ్యరాజ్. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ సినిమాలో భాగ్యరాజ్‌కు జోడీగా పూర్ణిమ నటించింది. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. పూర్ణిమ జయరామ్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తెలుగులో చిరంజీవి మంత్రిగారి వియ్యంకుడు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. భాగ్యరాజా, పూర్ణిమ దంపతులకు ఓ కొడుకుతో పాటు కూతురు ఉన్నారు. కొడుకు శంతను హీరోగా తమిళంలో పలు సినిమాలు చేశాడు.
పెళ్లి వేడుకలో సరదాగా....
సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కూతురు అవంతిక పెళ్లి గురువారం గోవాలో జరిగింది. ఈ పెళ్లి వేడుకకు భాగ్యరాజ్ అటెండ్ అయ్యారు. సీనియర్ యాక్టర్లతో కలిసి వేడుకలో సందడి చేశారు. అలనాటి జ్ఞాపకాలను అందరూ గుర్తుచేసుకుంటూ సరదాగా గడిపారు. పెళ్లి వేడుకుక అటెండ్ అయిన తర్వాత రోజే అతడి కన్నుమూయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖుష్బూ కూతురు పెళ్లికి భాగ్యరాజ్ అటెండ్ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Trisha – Tamannaah | ఒకే ఫ్రేమ్‌లో త్రిష, తమన్నా – ఖుష్బూ కూతురి పెళ్లిలో ముద్దుగుమ్మల సందడి
జూన్ 27, 2026

Bhagyaraj | కోలీవుడ్‌లో విషాదం – దిగ్గజ దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత – గురువు మరణించిన కొద్ది రోజులకే…
జూన్ 27, 2026

Keerthy Suresh | భర్తతో కలిసి శ్రీకాళహస్తిలో కీర్తి సురేష్ ప్రత్యేక పూజలు – ఫొటోలు వైరల్
జూన్ 26, 2026
తాజావార్తలు
- ●TET 2025 Postponed | టెట్ పరీక్ష వాయిదా.. పేపర్ లీక్ అవడంతో అధికారుల కీలక నిర్ణయం
- ●Telangana Cabinet | జులై 2 వ తేదీన మంత్రివర్గ సమావేశం
- ●Fixed Deposit | బ్యాంకు వర్సెస్ పోస్టాఫీస్.. ఏ ఎఫ్డీ ఎక్కువ వడ్డీని ఇస్తుంది..?
- ●Venkatesh | అఫీషియల్ : వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శకుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ - పోస్ట్‌పోన్ రూమర్లకు చెక్
- ●Snake in Underwear | ఆ పని చేస్తుండగా.. అండర్వేర్లోకి దూరిన పాము.. వీడియో
- ●WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు హెచ్చరికలు..

TET 2025 Postponed | టెట్ పరీక్ష వాయిదా.. పేపర్ లీక్ అవడంతో అధికారుల కీలక నిర్ణయం

Telangana Cabinet | జులై 2 వ తేదీన మంత్రివర్గ సమావేశం

Fixed Deposit | బ్యాంకు వర్సెస్ పోస్టాఫీస్.. ఏ ఎఫ్డీ ఎక్కువ వడ్డీని ఇస్తుంది..?

Venkatesh | అఫీషియల్ : వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శకుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ - పోస్ట్‌పోన్ రూమర్లకు చెక్



