త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ration Cards Deleted | రాష్ట్రంలో 1.40 లక్షల రేషన్ కార్డులు తొలగింపు

Ration Cards Deleted | తెలంగాణ‌లో 1.40 లక్షల రేషన్ కార్డులను తొలగించినట్లు (Ration Cards Deleted) కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా కలిగి ఉన్న రేషన్ కార్డులను (Ration Cards) కట్ చేసినట్లు వెల్లడించింది.

G

Telangana | Published On Apr 1, 2026, 8.13 am IST

Ration Cards Deleted | రాష్ట్రంలో 1.40 లక్షల రేషన్ కార్డులు తొలగింపు
Advertisement

Ration Cards Deleted | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ‌లో 1.40 లక్షల రేషన్ కార్డులను తొలగించినట్లు (Ration Cards Deleted) కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా కలిగి ఉన్న రేషన్ కార్డులను (Ration Cards) కట్ చేసినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పీడీఎస్‌ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బాంభానియా వెల్లడించారు. అదేవిధంగా దేశ‌వ్యాప్తంగా అన‌ర్హుల‌కు ఉన్న 41.41 ల‌క్ష‌ల‌ రేషన్ కార్డులను తొలగించినట్లు చెప్పారు. ఆదాయపు పన్ను శాఖ, రహదారి రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జీఎస్టీ సమాచారం ఆధారంగా అక్రమ రేషన్ కార్డులను తొలగించామ‌న్నారు.

అత్యధికంగా రాజస్థాన్‌లో 6 లక్షలకు పైగా రేషన్ కార్డులను తొల‌గించ‌గా, అతి తక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో 102 రేషన్ కార్డులను క‌ట్ చేసిన‌ట్లు తెలిపారు. ఇక దేశంలో ఉన్న మొత్తం 5.51 లక్షల రేషన్ షాపుల్లో లబ్ధిదారుల ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా రేషన్ సరుకులను మరింత సులభంగా పంపిణీ చేసేందుకు ఆపాస్ పరికరాలను అమర్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

పెరిగిన రేషన్ కార్డులు..

తెలంగాణలో గత ప్రభుత్వంలో ఉన్న రేషన్ కార్డుల కంటే ప్రస్తుత స‌ర్కార్‌లో 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు పెరిగినట్లు కేంద్ర గ‌ణాంకాలు వెల్ల‌డించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 17,348 రేషన్ షాపులు ఉండగా వాటి ద్వారా నెలకు 1.05 కోట్ల కార్డు దారులకు రేషన్ సరుకులు పంపిణీ జరుగుతుందని పేర్కొన్నాయి. అందులో 99,36,073 ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఉండగా.. 5,66,660 అంత్యోదయ అన్న యోజన కార్డులు.. అన్నపూర్ణ కార్డులు 5146 ఉన్నాయని తెలిపాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement