Vaakiti Srihari | స్వాతంత్య్రం తెచ్చిన, తెలంగాణ ఇచ్చిన జాతి మాది.. మీది నికృష్టపు జాతి
Vaakiti Srihari | దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన, తెలంగాణ ఇచ్చిన జాతి మాదని.. తెలంగాణ అమరవీరుల సమాధుల మీద గడీలు కట్టుకున్న నికృష్టపు జాతి మీదని కేటీఆర్‌పై మంత్రి వాకిటి శ్రీహరి ఫైరయ్యారు. రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న జాతని.. మీది ఉద్యమకారుల వెనక దాక్కున్న పిరికిపందల జాతి అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
- మాది రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న జాతి
- మీది ఉద్యమకారుల వెనక దాక్కున్న పిరికిపందల జాతి
- కేటీఆర్‌పై మంత్రి వాకిటి శ్రీహరి ఫైర్
Vaakiti Srihari | త్రినేత్ర.న్యూస్: దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన, తెలంగాణ ఇచ్చిన జాతి మాదని.. తెలంగాణ అమరవీరుల సమాధుల మీద గడీలు కట్టుకున్న నికృష్టపు జాతి మీదని కేటీఆర్‌పై మంత్రి వాకిటి శ్రీహరి ఫైరయ్యారు. రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న జాతని.. మీది ఉద్యమకారుల వెనక దాక్కున్న పిరికిపందల జాతి అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయనలో ఇంకా అధికార అహంకారం తగ్గలేదని నిరూపిస్తున్నాయి. ఇచ్చిన తెలంగాణను అందరూ మెచ్చె తెలంగాణగా తీర్చిదిద్దుతున్న జాతి మాది. తెలంగాణ ప్రజలకు విశ్వాసంగా ఉన్న జాతి.. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న జాతి మాదే. తెలంగాణను దోచుకున్న రాబందులను తరిమికొట్టాం. తెలంగాణ భవిష్యత్తు తరాలకు బాసటగా నిలిచాం అని మంత్రి వాకిటి పేర్కొన్నారు.
చితిమంటల మీద చలి కాచుకున్నది మీరే..
ఎక్కుపెట్టిన తుపాకికి ఎదురు నిలబడ్డ ఉద్యమకారుల వెనుక దాక్కున పిరికిపందల జాతి మీది. రాష్ట్రం కోసం నిలువెల్లా కాలిపోయిన విద్యార్థుల చితిమంటల మీద చలి కాచుకున్నది మీరు కాదా? యువకుల బలిదానాల మీద కూర్చొని పంచభక్ష్య పరమాన్నాలు తినడమే కాకుండా.. తెలంగాణ సంపదను అనకొండలా అమాంతం మింగేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకున్ని అహంకారం చూపించినందుకే తెలంగాణ ప్రజల చైతన్యం ముందు చెత్త కుప్పలో పడ్డారు. ఈ విషయాన్ని కేటీఆర్ మరిచిపోవొద్దు అని మంత్రి వాకిటి శ్రీహరి హితవు పలికారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






