త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OU Degree Exam Fee | ఓయూ ప‌రిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

OU Degree Exam Fee | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ సుధాక‌ర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

S

Telangana | Published On Oct 9, 2026, 8.19 pm IST

OU Degree Exam Fee | ఓయూ ప‌రిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
Advertisement

OU Degree Exam Fee | త్రినేత్ర న్యూస్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ సుధాక‌ర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీబీఏ, బీఎస్‌డ‌బ్ల్యూ తదితర కోర్సుల అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును ఈ నెల 29వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని పేర్కొన్నారు. రూ.500 అపరాధ రుసుముతో వచ్చే నెల 3వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in సూచించారు.

Advertisement
Advertisement