త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OU Degree Exam Fee | డిగ్రీ కోర్సుల ప‌రీక్షా ఫీజు స్వీక‌ర‌ణ గ‌డువు పొడిగింపు

OU Degree Exam Fee | ఉస్మానియా యూనివ‌ర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల ప‌రీక్షా ఫీజు స్వీక‌ర‌ణ గ‌డువు పొడిగించిన‌ట్లు ఓయూ కంట్రోల‌ర్ ఆఫ్ ది ఎగ్జామినేష‌న్స్ ప్రొఫెస‌ర్ శ‌శికాంత్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

S

Telangana | Published On Mar 16, 2026, 8.00 pm IST

OU Degree Exam Fee | డిగ్రీ కోర్సుల ప‌రీక్షా ఫీజు స్వీక‌ర‌ణ గ‌డువు పొడిగింపు
Advertisement

OU Degree Exam Fee | త్రినేత్ర‌.న్యూస్ : ఉస్మానియా యూనివ‌ర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల ప‌రీక్షా ఫీజు స్వీక‌ర‌ణ గ‌డువు పొడిగించిన‌ట్లు ఓయూ కంట్రోల‌ర్ ఆఫ్ ది ఎగ్జామినేష‌న్స్ ప్రొఫెస‌ర్ శ‌శికాంత్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డ‌బ్ల్యూ త‌దిత‌ర కోర్సుల నాలుగు, ఆరో సెమిస్ట‌ర్ రెగ్యుల‌ర్, అన్ని సెమిస్ట‌ర్ల బ్యాక్‌లాగ్ ప‌రీక్షల ఫీజుల‌ను ఈ నెల 23 నుంచి సంబంధిత కాలేజీల్లో చెల్లించాల‌ని సూచించారు. రూ. 500 ఆల‌స్య రుసుముతో 28వ తేదీ వ‌ర‌కు చెల్లించ‌వ‌చ్చ‌న్నారు. ఈ ప‌రీక్ష‌ల‌ను వ‌చ్చే నెల‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ప‌రీక్షా తేదీల పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని చెప్పారు. ఇత‌ర వివ‌రాల కోసం https://www.osmania.ac.in/ అనే వెబ్‌సైట్‌ను చూసుకోవ‌చ్చ‌న్నారు.

Advertisement
Advertisement