త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

University Employees | కాంట్రాక్ట్ అధ్యాప‌కుల పోరు ఉధృతం.. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టుకార్డ్ ఉద్య‌మం

University Employees | తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల పోరు ఉధృతమైంది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రెగ్యులరైజ్ చేయాలని, లేదా తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం ప్రభుత్వంలో విలీనం చేసి అబ్జార్ప్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు వారాలుగా UTACTS ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

S

Telangana | Published On Nov 27, 2026, 7.55 pm IST

University Employees | కాంట్రాక్ట్ అధ్యాప‌కుల పోరు ఉధృతం.. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టుకార్డ్ ఉద్య‌మం
Advertisement

University Employees | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల పోరు ఉధృతమైంది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రెగ్యులరైజ్ చేయాలని, లేదా తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం ప్రభుత్వంలో విలీనం చేసి అబ్జార్ప్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు వారాలుగా UTACTS ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ ఉద్యమంలో భాగంగా శుక్ర‌వారం రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పోస్ట్‌కార్డు ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి కాంట్రాక్ట్ అధ్యాపకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకి పోస్టుకార్డుల ద్వారా తమ సమస్యలను విన్న‌వించారు. రెండు దశాబ్దాలకు పైగా ఉన్నత విద్యారంగానికి అందిస్తున్న సేవలను, ఎదుర్కొంటున్న ఆర్థిక, ఉద్యోగ భద్రతాపరమైన ఇబ్బందులను వివరిస్తూ తమను రెగ్యులరైజ్ చేయాలని లేదా అబ్జార్ప్షన్ ద్వారా ప్రభుత్వంలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన నివేదికలోని సిఫార్సుల ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రెగ్యులరైజేషన్ లేదా అబ్జార్ప్షన్ ప్రక్రియలో జాప్యం జరిగితే, కనీసం ఏడవ వేతన సవరణ సంఘం (7th PRC) పే స్కేల్‌ను ఉద్యోగ భద్రతతో సహా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు, మా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నామ‌న్నారు.

ఈరోజు జరిగిన పోస్ట్‌కార్డు ఉద్యమంలో UTACTS రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పరశురాం, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరి నిరంజన్, ఉపాధ్యక్షులు భూమయ్య, సురేష్ నాయక్, శివరెడ్డి, కృష్ణప్రసాద్, రామకృష్ణ, తిరుపతయ్య, శ్రీనివాస్, బాలకోటి నాయక్, దత్తు, రమాదేవి, సంకినేని వెంకట్ 12 విశ్వవిద్యాలయాలకు చెందిన కాంట్రాక్ట్ అధ్యాపకులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

కోఠి మ‌హిళా యూనివ‌ర్సిటీలో..

పాల‌మూరు యూనివ‌ర్సిటీలో..

పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శుక్రవారం పోస్ట్‌కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌కు పోస్ట్‌కార్డుల ద్వారా తమ విజ్ఞప్తులను పంపించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భూమయ్య, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, డాక్టర్ రవికుమార్, డాక్టర్ సోమేశ్వర్, డా పర్వతాలు, డాక్టర్ తరుణ్, డాక్టర్ శారద, డా గురుస్వామి, డా రవికాంత్, చెన్నయ్య, డాక్టర్ భగవతి రెడ్డి, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

సికింద్రాబాద్ పీజీ కాలేజీలో..

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పోస్ట్ కార్డుల ఉద్యమంలో RGUKT(IIIIT) బాసర కాంట్రాక్ట్ టీచింగ్ స్టాఫ్..

డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీలో..

Advertisement
Advertisement