త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Osmania University | తాగునీటి కోసం రాత్రిపూట‌ ఓయూ విద్యార్థినుల ఆందోళన

Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో తాగునీటి సమస్య తీవ్రం కావడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కనీస అవసరమైన తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బుధ‌వారం రాత్రి వేళ విద్యార్థినులంతా ఒక్కటై హాస్టల్ ప్రధాన గేటు ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

P

Hyderabad | Published On Nov 25, 2026, 10.44 pm IST

Osmania University | తాగునీటి కోసం రాత్రిపూట‌ ఓయూ విద్యార్థినుల ఆందోళన
Advertisement
  • హాస్టల్ ప్రధాన గేటు ముందు రోడ్డుపై భైఠాయింపు
  • ‘వీ వాంట్ వాటర్.. వార్డెన్ రావాలి’ అంటూ నినాదాలు

Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో తాగునీటి సమస్య తీవ్రం కావడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కనీస అవసరమైన తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బుధ‌వారం రాత్రి వేళ విద్యార్థినులంతా ఒక్కటై హాస్టల్ ప్రధాన గేటు ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘వీ వాంట్ వాటర్.. వార్డెన్ రావాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినులకు కనీస అవసరమైన తాగునీటిని సైతం సరఫరా చేయలేని పరిస్థితి నెలకొందని వారు మండిపడ్డారు. ప్రతిరోజూ నీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని, సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తాగునీటి సమస్యతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. వార్డెన్ వెంటనే అక్కడికి చేరుకుని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. యూనివర్సిటీ అధికారులు తక్షణమే స్పందించి హాస్టల్‌కు నిరంతరాయంగా తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. విద్యార్థినుల కనీస అవసరాలను నిర్లక్ష్యం చేయకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

Advertisement
Advertisement