త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Osmania University | ఓయూ ప‌రిధిలో రేపు జ‌ర‌గాల్సిన అన్ని ప‌రీక్ష‌లు వాయిదా

Osmania University | ఈ నెల 24న ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ప‌రిధిలో జ‌ర‌గాల్సిన అన్ని ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ఓయూ అధికారులు ప్ర‌క‌టించారు. డిగ్రీ, పీజీ ప‌రీక్ష‌ల‌న్నింటినీ వాయిదా వేస్తున్నామ‌ని తెలిపారు.

S

Telangana | Published On Jul 23, 2026, 4.03 pm IST

Osmania University | ఓయూ ప‌రిధిలో రేపు జ‌ర‌గాల్సిన అన్ని ప‌రీక్ష‌లు వాయిదా
Advertisement

Osmania University | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల 24న ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ప‌రిధిలో జ‌ర‌గాల్సిన అన్ని ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ఓయూ అధికారులు ప్ర‌క‌టించారు. డిగ్రీ, పీజీ ప‌రీక్ష‌ల‌న్నింటినీ వాయిదా వేస్తున్నామ‌ని తెలిపారు. వాయిదా ప‌డ్డ ప‌రీక్ష‌ల‌ను ఎప్పుడు నిర్వ‌హిస్తామ‌నేది త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని చెప్పారు.

నీట్ పేప‌ర్ లీకేజీకి కేంద్రం బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థ‌ల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిల‌పునిచ్చాయి. నీట్ పేపర్ లీకేజీ దోషులను శిక్షించడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎన్‌ఎస్‌యూఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్‌, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్‌యూ సంఘాలు డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement
Advertisement