త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OU Degree Exams | ఓయూ ప‌రిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

OU Degree Exams | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.

S

Telangana | Published On Apr 29, 2026, 7.35 pm IST

OU Degree Exams | ఓయూ ప‌రిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
Advertisement

OU Degree Exams | త్రినేత్ర‌.న్యూస్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్ డబ్ల్యూ, బీబీఏ, బీబీఏ బిజినెస్ అనాలెటిక్స్, బీబీఏ లాజిస్టిక్స్, బీబీఏ రిటెయిల్ ఆపరేషన్స్, బీబీఏ ఫ్యాషన్ డిజైన్ మేనేజ్మెంట్, బీబీఏ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సుల నాలుగు, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షలను వచ్చే నెల 16వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

Advertisement
Advertisement