త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Strike | స‌మ్మె బాట‌లో జూనియ‌ర్ డాక్ట‌ర్లు.. ఉస్మానియాలో నిలిచిపోనున్న సేవ‌లు

Strike | ఉస్మానియా ద‌వాఖాన‌లో (Osmania Medical College) స‌మ్మె సైర‌న్ (Strike) మోగింది. హాస్పిట‌ల్‌లో మౌలిక వసతుల కొరత, ఆరోగ్యశ్రీ నిధుల బకాయిలతో వైద్య సేవలు స్తంభించిపోవ‌డం, పోస్టు గ్రాడ్యుయేట్ శిక్ష‌ణ‌, ప‌ని ప‌రిస్థితుల‌పై జూనియర్ డాక్టర్లు (Junior Doctors) స‌మ్మె బాట‌ప‌ట్టారు.

G

Telangana | Published On Oct 12, 2026, 6.23 am IST

Strike | స‌మ్మె బాట‌లో జూనియ‌ర్ డాక్ట‌ర్లు.. ఉస్మానియాలో నిలిచిపోనున్న సేవ‌లు
Advertisement

Strike | త్రినేత్ర న్యూస్‌: ఉస్మానియా ద‌వాఖాన‌లో (Osmania Medical College) స‌మ్మె సైర‌న్ (Strike) మోగింది. హాస్పిట‌ల్‌లో మౌలిక వసతుల కొరత, ఆరోగ్యశ్రీ నిధుల బకాయిలతో వైద్య సేవలు స్తంభించిపోవ‌డం, పోస్టు గ్రాడ్యుయేట్ శిక్ష‌ణ‌, ప‌ని ప‌రిస్థితుల‌పై జూనియర్ డాక్టర్లు (Junior Doctors) స‌మ్మె బాట‌ప‌ట్టారు. హాస్పిట‌ల్‌లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (OMC-JUDA) విధుల‌ను బ‌హిష్క‌రించ‌నున్నారు. సోమ‌వారం ఉదయం 8.30 గంటలకు హాస్పిట‌ల్‌ ప్రధాన ద్వారం వద్ద నిరసన ప్రారంభ‌మ‌వుతుంది. దీంతో ద‌వాఖాన‌లో ఎలక్టివ్ ఓపీడీ, సాధారణ ఆపరేషన్లు నిలిచిపోనున్నాయి.

రెసిడెంట్ల విద్యాభ్యాసం, క్లినికల్ శిక్షణ, హాస్పిట‌ల్‌లో పని పరిస్థితులు, రోగుల సంరక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాల లేమిపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్న‌వించుకున్న‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింద‌ని జూడా పేర్కొంది. ఏండ్ల‌ తరబడి శ్రమించి మెరిట్‌తో రెసిడెన్సీ స్థానాలను సాధించినప్పటికీ అవసరమైన విభాగాలు, ప్రాక్టికల్ సౌకర్యాలు లేకుండా కేవలం విధులు నిర్వర్తించడానికే వైద్య విద్య పరిమితం కాకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూడాల స‌మ్మె నేప‌థ్యంలో ఉస్మానియా ద‌వాఖాన‌లోని అన్ని విభాగాలు ఎలక్టివ్ ఓపీడీ (Outpatient Department) సేవలు, ఆపరేషన్ థియేటర్ సేవ‌లు నిలిచిపోనున్నాయి. అయితే ఎమర్జెన్సీ సేవలు, క్యాజువాల్టీ, ఐసీయూ వంటి అత్యవసర విభాగాల్లో విధులు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. సమస్యలపై పరిష్కారం చూపేంతవరకు త‌మ‌ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement