త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Razor Blades | బ్లేడ్లు మింగిన బాలుడు.. తొల‌గించిన ఉస్మానియా వైద్యులు..

Razor Blades | 16 ఏళ్ల బాలుడు రేజర్‌ బ్లేడ్లను మింగిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. తీవ్ర ఆందోళనకు గురైన బాలుడిని గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులు ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి (ఓజీహెచ్‌)కు తీసుకొచ్చారు. వైద్యులు ఎక్స్‌రే చేయగా.. కడుపులో బ్లేడ్‌ ముక్కలు ఉన్నట్లు గుర్తించారు.

P

Hyderabad | Published On Sep 4, 2026, 7.10 pm IST

Razor Blades | బ్లేడ్లు మింగిన బాలుడు.. తొల‌గించిన ఉస్మానియా వైద్యులు..
Advertisement

Razor Blades | 16 ఏళ్ల బాలుడు రేజర్‌ బ్లేడ్లను మింగిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. తీవ్ర ఆందోళనకు గురైన బాలుడిని గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులు ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి (ఓజీహెచ్‌)కు తీసుకొచ్చారు. వైద్యులు ఎక్స్‌రే చేయగా.. కడుపులో బ్లేడ్‌ ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బాలుడిని మెడికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి తరలించారు. ప్రొఫెసర్‌, విభాగాధిపతి డాక్టర్ బీ రమేశ్‌కుమార్‌ నేతృత్వంలోని వైద్య బృందం అత్యంత జాగ్రత్తగా జీఐ ఎండోస్కోపీ నిర్వహించింది. ఈ ప్రక్రియలో కడుపులో ఉన్న మూడు రేజర్‌ బ్లేడ్‌ ముక్కలను విజయవంతంగా తొలగించారు.

బ్లేడ్లు పదునుగా ఉండడంతో వాటిని తొలగించే ప్రక్రియ సవాల్‌గా మారింది. ఏమాత్రం పొరపాటు జరిగినా కడుపు, జీర్ణాశయంలో కోతలు పడటం, రంధ్రాలు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. ‘పదునైన బ్లేడ్‌ ముక్కల కారణంగా అంతర్గతంగా కోతలు పడడం, రంధ్రాలు ఏర్పడే అవకాశాలుండటంతో ఎండోస్కోపీ సవాలుగా మారింది’ అని డాక్టర్‌ రమేశ్‌కుమార్‌ తెలిపారు. బాలుడిని మహ్మద్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌గా గుర్తించారు. అత‌నికి గతంలో మానసిక ఆరోగ్య సమస్యల‌తో బాధ‌ప‌డిన‌ట్లుగా ఓజీహెచ్‌ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడని పేర్కొన్నారు. వివిధ రకాల విదేశీ వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తొలగించడంలో ఓజీహెచ్‌ మెడికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి అనుభవం ఉందని సీనియర్‌ వైద్యాధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement