Sunil Kumar | జీఎస్టీ ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత అరెస్ట్
Sunil Kumar | త్రినేత్ర.న్యూస్: బస్సు టికెట్ల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసి, ప్రభుత్వానికి కట్టకుండా జీఎస్టీ (GST) ఎగ్గొట్టిన కేసులో కాంగ్రెస్ (Congress) నాయకుడు, ఆరెంజ్ ట్రావెల్స్ (Orange Travels) ఎండీ సునీల్‌కుమార్ (Sunil Kumar)ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) (DGGI)అధికారులు అరెస్టు చేశారు.
Sunil Kumar | త్రినేత్ర.న్యూస్: బస్సు టికెట్ల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసి, ప్రభుత్వానికి కట్టకుండా జీఎస్టీ (GST) ఎగ్గొట్టిన కేసులో కాంగ్రెస్ (Congress) నాయకుడు, ఆరెంజ్ ట్రావెల్స్ (Orange Travels) ఎండీ సునీల్‌కుమార్ (Sunil Kumar)ను జీఎస్టీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనను నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపరిచారు. జీఎస్టీ ఎగవేతల అంశంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) (DGGI) అధికారులు తీవ్ర చర్యలకు ఉపక్రమించారు. హైదరాబాద్ జోనల్ యూనిట్‌లో సోదాలు నిర్వహించిన అధికారులు జీఎస్టీ ఎగ్గొట్టిన వారిపై ఉక్కుపాదం మోపేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్ (ఆరెంజ్ ట్రావెల్స్) ఎండీ సునీల్ కుమార్ రూ.28.24 కోట్లు, ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ఎండీ చేతన్ రూ.22 కోట్ల జీఎస్టీని ఎగ్గొట్టినట్లు గుర్తించారు. గడువు దాటి మూడు నెలలు గడిచినా పన్ను ప్రభుత్వానికి చెల్లించలేదు. దీంతో అధికారులు వారిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. సునీల్‌కుమార్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి అపజయం పాలయ్యారు.
సంబంధిత వార్తలు

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

Mahesh Kumar Goud | జనగణనలో కులగణన.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: పీసీసీ చీఫ్
మే 20, 2026

KTR | బీజేపీ, కాంగ్రెస్ కుట్రపూరిత చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



