Congress | అత్తాకోడళ్లు దోచుకుంటున్నారు
Congress | పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే (Palakurthy MLA) యశస్విని రెడ్డి (Yashaswini Reddy), ఆమె అత్త ఝాన్సీ రెడ్డి (Jhansi Reddy) పై కాంగ్రెస్ (Congress) అధిష్టానానికి స్థానిక నాయకులు ఫిర్యాదు చేశారు. వారి పరిపాలన బాగాలేదని, దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటూ టీపీసీసీ (TPCC) ఇంచార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)కు వినతిపత్రం అందజేశారు.
ఎన్నికలు ముగియగానే తట్టాబుట్ట సర్దుకుని అత్తాకోడళ్లు అమెరికాకు వెళ్లిపోయారు
కాల్వల పేరుతో కోట్లు దోచుకున్నారు
వారి వైఖరి కారణంగానే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మెజారిటీ
అధిష్టానం స్పందించకపోతే నియోజకవర్గంలో పార్టీకి నష్టం
పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే (Palakurthy MLA) యశస్విని రెడ్డి (Yashaswini Reddy), ఆమె అత్త ఝాన్సీ రెడ్డి (Jhansi Reddy) పై
కాంగ్రెస్ (Congress) అధిష్టానానికి స్థానిక నాయకులు ఫిర్యాదు
Congress | పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే (Palakurthy MLA) యశస్విని రెడ్డి (Yashaswini Reddy), ఆమె అత్త ఝాన్సీ రెడ్డి (Jhansi Reddy) పై కాంగ్రెస్ (Congress) అధిష్టానానికి స్థానిక నాయకులు ఫిర్యాదు చేశారు. వారి పరిపాలన బాగాలేదని, వారు నియోజకవర్గంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని, దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటూ టీపీసీసీ (TPCC) ఇంచార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి పరిస్థితి ఎక్కడా లేదని చెప్పారు. క్రమశిక్షణ లేని వ్యక్తులు, పౌరసత్వం లేని వ్యక్తులు తమపై ఆధిపత్యం చేయడం సరికాదన్నారు. భారత పౌరసత్వం లేకుండా తప్పుడు సమాచారం అందజేసి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా పదవి తీసుకున్నారని ఆరోపించారు. పౌరసత్వం ఉందని చెప్పి అధిష్టానాన్ని మోసం చేశారని మండిపడ్డారు. దీనిపై విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అత్తాకోడళ్ల వైఖరి కారణంగానే పంచాయతీ ఎన్నికల్లో ఓటమి..
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సైతం నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలిచిందని వారు గుర్తు చేశారు. దానికి కారణం ఎమ్మెల్యే, ఆమె అత్త ప్రవర్తన బాగాలేదని, ప్రజల్లో ఉండడంలేదని అన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టమొచ్చినా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల పూర్తవగానే అత్తాకోడళ్లు తట్టా బుట్ట సర్దుకుని అమెరికాకు వెళ్లిపోయారని విమర్శించారు. ప్రజల కష్టనష్టాలను చూసే నాయకులను అసమర్థులుగా ఆమె చిత్రీకరించిందని వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 47 వేల మెజారిటీతో కాంగ్రెస్ గెలిచిందని, కానీ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండు వేల మెజారిటీ సాధించిందని వివరించారు.
కాలువల అభివృద్ధి పేరుతో కోట్లు దోపిడీ..
పాలకుర్తి నియోజకవర్గంలో కాలువల అభివృద్ధి పేరుతో ఎంపీ నిధుల నుంచి ఝాన్సీరెడ్డి కోట్లు తీసుకుందని వారు ఆరోపించారు. అత్తాకోడళ్లు ఎంపీ నిధుల లెక్క చెప్పకుండా దోచుకున్నారని మండిపడ్డారు. స్థానిక ఎంపీ ఆరు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నప్పటికీ పాలకుర్తి నియోజకవర్గానికి రావడం లేదని చెప్పారు. దీనిపై ఎంపీని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే పిలవాలి కదా అని ఎదురు ప్రశ్న వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎంపీ నిధులు ఏం చేశారో ఎవరికీ తెలియదన్నారు. గతంలోనూ ఒక ట్రస్ట్ పేరుతో కాల్వలు తీశామని చెప్పి, ఎంపీ నిధులు తీసుకున్నారని, అవి ఏమయ్యాయో ఇప్పటికీ బయటపడలేదని ఆరోపించారు. వీటన్నింటినీ మీనాక్షికి ఫిర్యాదు చేశామని, ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడికి సైతం ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
సంబంధిత వార్తలు

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

Mahesh Kumar Goud | జనగణనలో కులగణన.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: పీసీసీ చీఫ్
మే 20, 2026

KTR | బీజేపీ, కాంగ్రెస్ కుట్రపూరిత చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



