త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | టెలిమెట్రీల నిధులు దారి మ‌ళ్లిస్తుంటే ప్ర‌భుత్వం చోద్యం చూడ‌డం సిగ్గుచేటు : హ‌రీశ్‌రావు

Harish Rao | కృష్ణా న‌దీ జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు టెలిమెట్రీల‌ కోసం కేటాయించిన రూ.4.18 కోట్ల నిధులను కేఆర్ఎంబీ (KRMB) దారి మ‌ళ్లిస్తుంటే తెలంగాణ (Telangana) ప్ర‌భుత్వం చోద్యం చూడ‌డం సిగ్గుచేట‌ని బీఆర్ఎస్ (BRS) శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేత హ‌రీశ్‌రావు (Harish Rao) అన్నారు. ఉద్దేశపూర్వకంగానే టెలిమెట్రీల‌ ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం చేస్తూ, కృష్ణా జలాల ఏపీ అక్రమ వినియోగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం దుర్మార్గమ‌ని మండిప‌డ్డారు.

A

Telangana | Published On Jan 8, 2026, 5.48 pm IST

Harish Rao | టెలిమెట్రీల నిధులు దారి మ‌ళ్లిస్తుంటే ప్ర‌భుత్వం చోద్యం చూడ‌డం సిగ్గుచేటు : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | కృష్ణా న‌దీ జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు టెలిమెట్రీల‌ కోసం కేటాయించిన రూ.4.18 కోట్ల నిధులను కేఆర్ఎంబీ (KRMB) దారి మ‌ళ్లిస్తుంటే తెలంగాణ (Telangana) ప్ర‌భుత్వం చోద్యం చూడ‌డం సిగ్గుచేట‌ని బీఆర్ఎస్ (BRS) శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేత హ‌రీశ్‌రావు (Harish Rao) అన్నారు. ఉద్దేశపూర్వకంగానే టెలిమెట్రీల‌ ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం చేస్తూ, కృష్ణా జలాల ఏపీ అక్రమ వినియోగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం దుర్మార్గమ‌ని మండిప‌డ్డారు. జూన్ 2016లో జరిగిన కేఆర్ఎంబీ సమావేశ నిర్ణయం ప్రకారం మొదటి దశలో 18 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయగా, రెండో దశలో ఇంకా తొమ్మిది చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమలు కాకపోవడం దురదృష్టకరమ‌ని అన్నారు.

కేఆర్ఎంబీ నిర్ణ‌యాన్ని ధిక్కరిస్తూ టెలీమెట్రీ ఏర్పాటు కోసం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటే ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని ప్ర‌శ్నించారు. ఏపీ మీద ఒత్తిడి చేయకుండా ఎందుకు మౌనంగా ఉన్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడాల్సిన కేఆర్ఎంబీ, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని తెలంగాణకు అన్యాయం చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఏపీ, కేంద్రంలోని బీజేపీ మూడు కలిసి టెలీమెట్రిల ఏర్పాటును నిర్లక్ష్యం చేస్తూ, తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాయని ధ్వ‌జ‌మెత్తారు.

టెలిమెట్రీ ఏర్పాటు చేస్తున్నామ‌ని ప్రచారం చేసుకోవడమే తప్ప రెండేళ్ల నుండి కేంద్రం చేసింది ఏం లేదని ఎద్దేవా చేశారు. స‌బ్ జ్యుడీస్‌ అని సాకులు చెప్పే కేంద్రానికి, సుప్రీం కోర్టులో కేసు ఉన్నప్పటికీ కేసీఆర్ 18 చోట్ల టెలీమెట్రీలు ఏర్పాటు చేశార‌ని గుర్తు చేశారు. పోలవరం నల్లమల సాగర్ విషయంలో మొద్దు నిద్ర ప్రదర్శించినట్లుగానే, టెలీమెట్రీల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమ‌న్నారు. రూ. 4.18 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులను వెంటనే రికవరీ అయ్యేలా చేసి, టెలీమెట్రీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేవలం లేఖలు రాస్తూ కాలయాపన చేయకుండా, నిధులు మళ్లించిన కేఆర్ఎంబీపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement