త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Chopra | ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ – నేరుగా ఓటీటీలో రిలీజ్ – స్ట్రీమింగ్ డేట్‌, ప్లాట్‌ఫామ్ ఏవంటే?

ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టించిన హాలీవుడ్ మూవీ ది బ్ల‌ఫ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీ ద్వారా ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఫిబ్ర‌వ‌రి 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Jan 8, 2026, 6.02 pm IST

Priyanka Chopra | ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ  – నేరుగా ఓటీటీలో రిలీజ్ –  స్ట్రీమింగ్ డేట్‌, ప్లాట్‌ఫామ్ ఏవంటే?
Advertisement

వార‌ణాసి మూవీతో టాలీవుడ్‌లో తొలి అడుగు వేయ‌బోతుంది ప్రియాంక చోప్రా. మ‌హేష్‌బాబు హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీకి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దాదాపు 1500 కోట్ల బ‌డ్జెట్‌తో పాన్ వ‌ర‌ల్డ్ సినిమాగా వార‌ణాసి రూపొందుతోంది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత రాజ‌మౌళి సినిమాతోనే ఇండియ‌న్ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది ప్రియాంక చోప్రా.

హాలీవుడ్‌లో సెటిల్‌...

సింగ‌ర్ నిక్ జోన‌స్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా గ‌త కొన్నేళ్లుగా హాలీవుడ్ సినిమాలకే ప‌రిమిత‌మ‌వుతూ వ‌చ్చింది. మ్యాట్రిక్స్‌, ల‌వ్ ఎగైన్‌తో పాటు ప‌లు హాలీవుడ్ సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపించింది. ఇవ‌న్నీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తాజాగా ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ది బ్ల‌ఫ్ పేరుతో హాలీవుడ్‌లో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ గురువారం క‌న్ఫామ్ చేశారు. థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలో ఈ హాలీవుడ్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఫిబ్ర‌వ‌రి 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ది బ్ల‌ఫ్ స్ట్రీమింగ్ కానుంది.

పైరెట్ పాత్ర‌లో...

ఈ విష‌యాన్ని ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్వ‌యంగా ప్ర‌క‌టించింది. ఈ సినిమాలోని కొన్ని ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఇందులో బ్ల‌డీ మేరీ అనే యోధురాలి పాత్ర‌లో ప్రియాంక చోప్రా క‌నిపించ‌బోతున్న‌ది.
త‌ల్లిగా, సంర‌క్ష‌కురాలిగా, దొంగ‌గా డిఫ‌రెంట్ షేడ్స్‌లో త‌న క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని ప్రియాంక చోప్రా తెలిపింది.
ఓ పైరెట్‌ గ‌త జీవితానికి స్వ‌స్థి చెప్పి కుటుంబంతో ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌డుపుతున్న ఓ మ‌హిళ అనుకోకుండా పోరాట మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాల్సివ‌చ్చింది? ఓ పెద్ద ప్ర‌మాదం నుంచి త‌న కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకుంద‌నే పాయింట్‌తో ఈ మూవీ రూపొంద‌నుంది.
ది బ్ల‌ఫ్ మూవీకి ఫ్రాంక్‌ ఈ ఫ్ల‌వ‌ర్స్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో కార్ల్ అర్బ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. హాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కులు రూసో బ్ర‌ద‌ర్స్ ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు.
ప్ర‌స్తుతం వార‌ణాసి షూటింగ్‌తో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. 2027 ఏప్రిల్‌లో ఈ భారీ బ‌డ్జెట్ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో మందాకిని అనే స్పై రోల్‌లో ప్రియాంక చోప్రా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ALSO READ Jana Nayagan | 27 క‌ట్స్‌, 50 డైలాగ్స్ మ్యూట్ – జ‌న‌నాయ‌గ‌న్‌కు షాకివ్వ‌నున్న సెన్సార్ క‌మిటీ
Advertisement

తాజావార్తలు

Advertisement