Bollam Mallaiah Yadav | బీఆర్ఎస్ కార్యకర్తలపై మళ్లీ దాడులు జరిగితే చట్టపరంగా పోలీసుల బట్టలూడదీస్తాం: బొల్లం మల్లయ్యయాదవ్
Bollam Mallaiah Yadav | బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలపై కాంగ్రెస్ (Congress) నాయకులు దాడికి పాల్పడితే ఉరికించి కొడుతామని కోదాడ మాజీ ఎమ్మెల్యే (Kodada Ex MLA) బొల్లం మల్లయ్య యాదవ్ (Bollam Mallaiah Yadav) హెచ్చరించారు. పోలీసుల అండతోనే ఇది జరుగుతోందని, మరోసారి పునరావృతమైతే చట్టపరంగా పోలీసుల బట్టలూడదీస్తామని అన్నారు.
Bollam Mallaiah Yadav | తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తే కాంగ్రెస్ (Congress) నాయకులను ఉరికించి కొడతామని బీఆర్ఎస్ (BRS) నేత, కోదాడ మాజీ ఎమ్మెల్యే (Kodada Ex MLA) బొల్లం మల్లయ్య యాదవ్ (Bollam Mallaiah Yadav) హెచ్చరించారు. పోలీసుల అండలో ఊర్లల్లో బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చివేస్తున్నారని, తమ పార్టీ కార్యకర్తలనపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై మళ్లీ దాడులు జరిగితే చట్టపరంగా పోలీసుల బట్టలూడదీస్తామని, కాంగ్రెస్ నేతలను తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చారు. కోదాడ నియోజవకర్గంలోని చిలుకూరు మండలంలో జరిగిన సర్పంచుల అభినందన సభకు మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
"పోలీసులు లాఠీ రాజ్యాన్ని నడిపిస్తున్నరు. కాంగ్రెస్ నాయకులు పోలీసులు, అధికారుల అండతో గ్రామాల్లో స్వైర విహారం చేస్తున్నారు. అధికార పక్ష నాయకులకు ముఖం చెల్లక.. ప్రతిపక్ష నేతలు, వారి ఇండ్లపై దాడులకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ గద్దెలను ధ్వంసం చేస్తున్నరు. ఖబడ్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా.. మల్లొకసారి ఇలాంటి దాడులు పునరావృతమైతే.. కోదాడ నియోజకవర్గంలో ఎక్కడా గులాబి జెండాను ముట్టుకున్నా.. బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యం జరిగినా.. ఏలుకు ఏలు.. కాలుకు కాలు సమాధానం ఇస్తాం.
మా కార్యకర్తలపై దాడి జరిగితే.. దానికి ప్రతి సమాధానంగా మేం కూడా దాడులకు దిగుతామని పోలీసులకు హెచ్చరిస్తున్నా. ఇవ్వాల కొండాపురంలో జరిగింది.. రేపు ఇంకెక్కడ దాడి చేయడానికి చూస్తున్నారో తెలియదు. నూటికి నూరు శాతం పోలీసులు చర్యలు తీసుకోకపోతే, అధికార పార్టీ నాయకులు పోలీసులు తమకు అండగా ఉన్నారన్న ధీమాతో ముందడుగు వేస్తే.. తప్పకుండా చట్టపరంగా పోలీసోల్ల బట్టలిప్పుతం. అధికార పార్టీ వాళ్లను ఊర్ల నుంచి బయటకు వెళ్లగొడుతం."అని అన్నారు.
సంబంధిత వార్తలు

Bollam Mallaiah Yadav | రైతుల మరణాలపై సీఎం రేవంత్ అవహేళన మాటలు.. మండిపడ్డ మల్లయ్య యాదవ్
మే 30, 2026

MP Chaamala Kirankumar Reddy | ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ బలోపేతం కోసమే రైతు డిస్కం: ఎంపీ చామల
మే 29, 2026

Bollam Mallaiah Yadav | చరిత్రకే కాదు.. ఎన్టీఆర్కే అవమానం.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బొల్లం మల్లయ్య యాదవ్ ఫైర్
మే 29, 2026
తాజావార్తలు
- ●Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల



