Ramchandar Rao | జూరాల గేట్లు వెంటనే ఓపెన్ చేయండి
Ramchandar Rao | జూరాల గేట్లు వెంటనే ఓపెన్ చేసి రైతులకు సాగు నీరు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఎల్‌నినో వస్తుందని తెలిసినా ఏం యాక్షన్ ప్లాన్ చేశారని నిలదీశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రైతులను నిండా ముంచాయని ఆరోపించారు.
- రేపు జూరాల వెళ్లి రైతులతో మాట్లాడుతం
- బీఆర్ఎస్, కాంగ్రెస్ రైతులను మోసం చేశాయి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శలు
Ramchandar Rao | త్రినేత్ర.న్యూస్: జూరాల గేట్లు వెంటనే ఓపెన్ చేసి రైతులకు సాగు నీరు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఎల్‌నినో వస్తుందని తెలిసినా ఏం యాక్షన్ ప్లాన్ చేశారని నిలదీశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రైతులను నిండా ముంచాయని ఆరోపించారు. కర్ణాటకలో వానలు పడ్డాయని.. నీళ్లు విడుదల చేయాలని సీఎం రేవంత్ వాళ్ల ఫ్రెండ్ డీకే శివకుమార్‌ను అడగాలని సూచించారు. వీళ్లు రైతుల పక్షపాతి కాదని.. రైతు కక్షపాతి అని విమర్శించారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు పార్టీలపై ఫైరయ్యారు.
ఆల్మట్టి నుంచి ఇవ్వమని అడగండి..
జూరాల దగ్గర ఓ మంత్రి పోయి గేట్లు ఓపెన్ చేస్తా అంటడు. ఇంకోడు పోయి గేట్లు బంజేస్తా అంటరు. జూరాల కింద ఉన్న రైతుల పంటలు నాశనమైతున్నయ్. మస్తు నీళ్లున్నయ్. రేవంత్ ఫ్రెండ్ డీకే శివకుమార్ ఉన్నడు కదా ఆయన్ను అడగండి. ఆల్మట్టిలో ఎక్సస్ వాటర్ ఉన్నయ్. వాటిని వదిలిపెట్టమని చెప్పండి. కృష్ణా జలాలతో రాజకీయాలు చేస్తున్నరు. లక్షలాది మంది రైతులు నష్టపోతున్నరు. జూరాల గేట్లు ఓపెన్ చేయాలని మేం డిమాండ్ చేస్తున్నం.
ఇంజినీర్లతో కలిసి వెళ్తాం..
రేపు బీజేపీ బృందంతో కలిసి జూరాలకు పోతున్నం. రైతులతో మాట్లాడుతాం. కష్టనష్టాలను కనుక్కుంటాం. గేట్లు ఇడవాల్సిందే, నీళ్లు కిందకు వెళ్లాల్సిందే. లేదంటే రైతులు నష్టపోతారు. ఫసల్ బీమా ఇయ్యరు.. కానీ నీళ్లయినా ఇవ్వండి. ఆరోజు భట్టిగారే అసెంబ్లీలో చెప్పారు ఫసల్ బీమా అమలు చేస్తామని. అసలు రైతుల గురించి ఆలోచిస్తున్నరా? ఎల్‌నినో వస్తుందని ముందే తెలుసు. ఏం జాగ్రత్తలు తీసుకున్నరు. యాక్షన్ ప్లాన్ ఏంది?
కేంద్రాన్ని ఏమైనా అడిగారా?
ఎల్‌నినో వస్తుందని ఏదైనా సాయం చేయండని కేంద్రానికి చెప్పారా? అసలు వీళ్లు మీటింగ్ పెట్టారా? ఒక్క మీటింగ్ జరగలే.. ఒక్కలు మాట్లాడలే. బయటకొచ్చి ఎల్‌నినో అని మాట్లాడుతరు. ఏం ప్లానింగ్ చేశారో ఈ ప్రభుత్వం చెప్పాలి. అడక్కుండానే అన్నీ ఇస్తున్నం. రహదారులు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ఇస్తున్నం. బుల్లెట్ ట్రైన్, వందే భారత్ ఇస్తున్నం. బియ్యంలో 90 శాతం ఇస్తున్నం. మోదీ ప్రజల కోసమే ఆలోచిస్తడు. ఇప్పటివరకు 13 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చినం. కావాలంటే చర్చకు సిద్ధంగా ఉన్నాం.
ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినా అక్కడికి పోలేదు. మేం ఇంజినీర్లను తీసుకొని పోతం. వాళ్లు అన్ని వాస్తవాలు చెప్తారు. కాంగ్రెస్ బండారం బయటపెడుతం. కర్ణాటకల వానలు పడ్డయ్. వాళ్లను అడగాలి. 490 టీఎంసీలు రావాల్సి ఉంటే 250కి సంతకం పెట్టింది కేసీఆర్ కాదా? రెండు పార్టీల వాళ్లు రైతులను మోసం చేసి జలాల గురించి మాట్లాడుతున్నరు. ఆ ఫామ్‌హౌస్, ఈ ఫామ్‌హౌస్ కాదు.. కేసులు పెట్టకుండా మీడియాలో స్పేస్ కోసం డ్రామాలు ఆడుతున్నారు. చిత్తశుద్ధి ఉంటే అరెస్టు చేయండి. కేసులు ఎందుకు బుక్ చేయట్లేదు. ప్రభుత్వం ఎట్ల చెప్తే పోలీసులు అట్ల నడుస్తున్నరు. రెండు పార్టీల వాళ్లు టైం పాస్ చేస్తున్నరు.
ఫసల్ బీమా అమలు చేస్తే రైతులను ఆదుకునేవాళ్లం..
ఫసల్ బీమా యోజన ఎందుకు అమలు చేయట్లేదు. దాదాపు 90 కోట్ల మంది ఉన్నరు. అన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తున్నరు. తెలంగాణలో 2019లో బీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి అమలు చేయడం లేదు. 2019 నుంచి 39 లక్షల మంది దీని కింద ఉన్నారు. దీని కోసం అప్పుడు రూ.1906 కోట్లు ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ వాళ్లేమో మా ఫసల్ బీమా చేస్తామని చెప్పారు. రైతులు సాగు నీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఫసల్ బీమా ఉంటే ఈరోజు మోదీగారు ఆదుకునేవాళ్లు. 1000 రోజులు దాటినా ఆ బీమాను తీసుకురాలేదు. ఇప్పటికైనా అమలు చేయండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ వల్ల రైతులకు నష్టం జరుగుతుంది. మళ్ల మాట్లాడితేనేమో రైతుల పక్షపాతి అంటరు. వీళ్లు పక్షపాతి కాదు.. రైతు కక్ష పాతి అని రాంచందర్‌రావు విమర్శించారు.
తాజావార్తలు
- ●Venkatesh | ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ స్టెప్పులు - ఆదర్శకుటుంబం ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్
- ●Facebook | ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు భారీ అంతరాయం.. వేలాది ఫిర్యాదులు..
- ●Indiramma Indlu Allotment Letters | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త.. నేటి నుంచే ఫోన్లలోకి అలాట్మెంట్ లెటర్లు, డౌన్లోడ్ చేసుకోండిలా!
- ●Annamalai | పెట్టుబడుల కోసం డెడ్ ఎకానమీ దేశానికి వెళ్లడమేంటి..? విజయ్ యూకే పర్యటనపై అన్నామలై విమర్శలు
- ●Krithi Shetty | బేబమ్మ బర్త్‌డే ట్రీట్ - లంగా ఓణీలో కృతిశెట్టి - జనవరి 12 విడుదల ఫస్ట్ లుక్ రిలీజ్
- ●Kasaragod Road Accident | రోడ్డుపై భయానక ప్రమాదం: జీప్‌ను బలంగా ఢీకొట్టి గాల్లోకి ఎగిరిపడ్డ బైకర్.. ఒళ్లు గగుర్పొడిచే సీసీటీవీ ఫుటేజ్

Venkatesh | ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ స్టెప్పులు - ఆదర్శకుటుంబం ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్

Facebook | ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు భారీ అంతరాయం.. వేలాది ఫిర్యాదులు..

Indiramma Indlu Allotment Letters | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త.. నేటి నుంచే ఫోన్లలోకి అలాట్మెంట్ లెటర్లు, డౌన్లోడ్ చేసుకోండిలా!

Annamalai | పెట్టుబడుల కోసం డెడ్ ఎకానమీ దేశానికి వెళ్లడమేంటి..? విజయ్ యూకే పర్యటనపై అన్నామలై విమర్శలు






